అర్ధరాత్రి యువతిపై రేప్: సోదరులను చితకబాదారు

తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని మొదట రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మెజా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుల పేర్లు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి అనారోగ్యంగా ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బాధిత యువతి తమ ఇంట్లో నిద్రిస్తోంది. ఆమె ముగ్గురు సోదరులు సోనూ, ప్రవీణ్, రాజబాబులు మరో గదిలో నిద్రిస్తున్నారు.
కాగా, అర్ధరాత్రి సమయంలో కిటికీలోంచి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న ఆమె సోదరులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని మరో ముగ్గురు దుండగులు తీవ్రంగా చితకబాది వారి గదిలోనే బంధించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను వదిలేసి నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.












Click it and Unblock the Notifications