వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా విలేకరికి వేధింపు: తప్పుకున్న తెహెల్కా చీఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఓ మహిళా విలేకరి పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు తరుణ్ తేజ్‌పాల్ తనకు తానుగా ఎడిటర్ స్థానం నుండి బుధవారం తప్పుకున్నారు.

ఆరు నెలల పాటు ఆయన ఆ పదవికి దూరంగా ఉండనున్నారు. ఓ మహిళ పట్ల తాను అమర్యాదగా ప్రవర్తించానని, సంపాదకుడి పదవి నుంచి ఆరు నెలల పాటు తప్పుకుంటున్నానని తరుణ్ పేర్కొన్నారు. ఈ మేరకు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమ చౌదరికి తరుణ్ తేజ్‌పాల్ ఓ లేఖ రాశారు.

Women

'తప్పుడు నిర్ణయం, పరిస్థితి సరిగా అంచనా వేయకపోవడం వల్ల దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మహిళా విలేకరి పట్ల తన అమర్యాదక పూర్వక ప్రవర్తనకు ఇప్పటికే ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్పాను. ఈ ప్రాయశ్చితం సరిపోదని భావించి తాను ఎడిటర్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. మాటలతో ప్రాయశ్చితం సరిపోదని భావిస్తున్నాను. ఈ కారణంగానే తాను తెహెల్కా ఎడిటర్ స్థానం నుండి, తెహెల్కా కార్యాలయం నుండి ఆరు నెలలు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నాను' అని పేర్కొన్నారు.

తేజ్‌పాల్ రాసిన ఈ లేఖను తెహెల్కా ఉద్యోగులకు బుధవారం సాయంత్రం పంపించారు.

అయితే తరుణ్ తేజ్‌పాల్ లైగింక వేధింపుల వ్యవహారంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వివరాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.

ఉద్యోగులకు తేజ్‌పాల్ మెయిల్‌ను ఫార్వర్డ్ చేసిన సోమ చౌదరి.. ఇది ఊహించని ఘటన అని, తరుణ్ బేషరతు క్షమాపణలు కోరారని, అయినప్పటికీ తనంత తాను ఆరు నెలలు కార్యాలయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని రాశారు.

దీనిపై ఎన్డీటివి సోమాను ప్రశ్నిస్తే.. ఇది తమ అంతర్గత వ్యవహారమని, సదరు జర్నలిస్టు ఈ చర్యపై సంతృప్తికరంగా ఉన్నారనుకుంటున్నామని, తరుణ్ తనంతట తాను వైదొలిగారని చెప్పారు.

అయితే తరుణ్ తేజ్‌పాల్ లైగింక వేధింపుల వ్యవహారంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వివరాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.

English summary
In a shocking incident on Wednesday, Tarun Tejpal, the Editor of the news giant Tehelka, has "removed himself" from the position for a period of 6 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X