తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ టెన్షన్, ఉద్యోగం కోల్పోవడంపై ఈసీ నోటీసులు
వారణాసిలో ప్రధాని మోడిని దీటుగా ఎదుర్కోనేందుుకు నామినేషన్ వేసిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తెజ్ బహదూర్ నామినేషన్ పత్రాల్లో గందగోళం నెలకొంది. ఆయన ఉద్యోగానికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడంతో ఈసీ నోటీస్ జారీ చేసింది. దీంతో ప్రతిష్టాత్మకంగా వేసిన నామినేషన్ ఉంటుందా ,రిజక్ట్ చేస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మోదీని దీటుగా ఎదుర్కోనేందుకు ఎస్పి ఎత్తులు
తేజ్ బహదూర్ యాదవ్ వారణాసిలో ప్రధాని మోడిపై నామినేషన్ వేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వారణాసిలో పోటి చేస్తున్న ప్రధాని మోడికి దీటుగా సమాధానం చెప్పేందుకు మహ ఘట్‌బంధన్ పావులు కదిపింది. ఈనేపథ్యంలో తేజ్ బహదూర్ యాదవ్ కు సమాజ్ వాది పార్టీ నుండి పోటి చేసేందుకు పార్టీ అంగీకారం తెలిపింది. దీంతో ఎస్పి నుండి నామినేషన్ వేశారు తేజ్ బహదూర్ యాదవ్ . అయితే ఆయన అంతకు ముందే స్వతంత్ర్య అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. అనంతరం పార్టీ తరపున మరో నామినేషన్ వేశారు.

నామినేషన్ పత్రాల స్క్రూటిని ,పత్రాలపై ఈసీ నోటీసులు
దీంతో నామినేషన్లపై మంగళవారం స్క్రూటిని జరిగింది. స్క్రూటినిలో తేజ్ బహదూర్ యాదవ్ ఉద్యోగానికి సంబంధించి సరైన సమాధం లేదు. స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో తాను ఉద్యోగాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందనే అనే దానికి సమాధానం ఇస్తూ జవాన్ల ఆహర సరఫరా పై పలు ఆరోపణలు చేసినందుకు తనను ఉద్యోగం నుండి తొలగించారని పేర్కోన్నారు. అయితే రెండవసారి సమాజ్ వాది పార్టీ తరుఫున వేసిన నామినేషన్లతో మాత్రం ఏలాంటీ సర్టిఫికెట్ ను అందించలేదు. దీంతో నామినేషన్లను స్క్రూటిని చేసిన ఈసీ తన ఉద్యోగ తొలగింపుపై నేటి వరకు (బుధవారం ) సమాధానం చెప్పాలని నోటీస్ జారి చేసింది.

అవినీతి మరియు అవిశ్వానికి పాల్పడిన ఉద్యోగులకు పోటీ అవకాశం లేదు.
అవినీతీ మరియు అవిశ్వాసం ద్వార ప్రభుత్వం ఉద్యోగి ఎవరైన ఉద్యోగం నుండి డిస్మిస్ అయితే వారు ఎన్నికల్లో పోటి చేయడానికి అనర్హులు అవుతారు. వారు ఉద్యోగం నుండి డిస్మిస్ అయినప్పటినుండి అయిదు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటి చేయకూడదనే నిబంధన ఉంది. ఈనేపథ్యంలోనే తేజ్ బహదూర్ యాదవ్ ఉద్యోగం నుండి అవినీతీ చేసినందుకా లేదా అవిశ్వాసం వల్లన అనేది పేర్కనలేదంటూ నోటీస్ లో పేర్కోన్నారు.












Click it and Unblock the Notifications