Tejashwi Yadav: ఎన్డీయే షాక్ నుంచి కోలుకున్న తేజస్వీ..! బిగ్ టర్న్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం ఖాయమైన వేళ సీఎం అభ్యర్ధి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా పార్టీ కంచుకోట రాఘోపూర్ స్ధానంలోనూ వెనుకబడ్డారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన తేజస్వి.. ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడ్డారు. ఓవైపు పార్టీ అభ్యర్ధులు వరుసగా ఓటమి బాటలో ఉండగానే.. తేజస్వి కూడా రేసులో వెనుకబడ్డారు. దీంతో ఇతర నేతల తరహాలోనే తేజస్వీ కూడా ఓటమిపాలవ్వబోతున్నట్లు అంతా భావించారు.

కానీ తేజస్వీ యాదవ్ 20వ రౌండ్ కు వచ్చేసరికి క్రమంగా ఆధిక్యంలోకి రావడం ప్రారంభించారు. ప్రతీ రౌండ్ కు రెండు, మూడు వేల చొప్పున ఆధిక్యం సాధిస్తున్నారు. దీంతో తాజా సమాచారం అందేసరికి తేజస్వీ యాదవ్ ఏకంగా 13 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మరికొన్ని రౌండ్లలోనే తేజస్వి విజయం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. రాఘోపూర్ లో బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ తో పోటీ పడిన తేజస్వి ఇక్కడ గెలిస్తే కనీసం ప్రతిపక్ష నేత అయ్యే ఛాన్స్ లభించనుంది.

Tejashwi Yadav Triumphs in Raghopur After Early Scare Securing 13 000-Vote Leadv

గతంలో ఇదే సతీష్ కుమార్ జేడీయూ అభ్యర్ధిగా పోటీ చేసి తేజస్వి యాదవ్ తల్లి రబ్రీ దేవిని ఓడించిన చరిత్ర ఉంది. దీంతో ఈసారి రాఘోపూర్ లోనూ ఆయన బీజేపీ అభ్యర్ధిగా తేజస్విని ఓడించే అవకాశం లభించిందని అంతా భావించారు. కానీ ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకునే సరికి సతీష్ కుమార్ పై తేజస్వీ యాదవ్ ఆధిక్యం పెరుగుతూ పోతోంది. మిగిలిన రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తేజస్వి యాదవ్ కు సంపూర్ణ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది.

Tejashwi Yadav Triumphs in Raghopur After Early Scare Securing 13 000-Vote Leadv

ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే భారీ విజయం సాధించింది. రాష్ట్ర ఎన్నికల్లోనే భారీగా జరిగిన పోలింగ్ కు అనుగుణంగా పాజిటివ్ ఓటుతో 200కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. దీంతో మహాకూటమి కేవలం 30-40 సీట్లతో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+