పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ కు ఏం పని ?, ఆ పార్టీల తో మ్యాచ్ ఫిక్సింగ్, బండి సంజయ్ !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటకలో అభివృద్ది కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని, తెలంగాణలో రామరాజ్యం కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకుంటే పాకిస్తాన్ కు వెళ్లి లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తారని బండి సంజయ్ వ్యంగంగా అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులోని యలహంకలో ఆ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ కు మద్దతుగా ఇంటింటికి తిరిగి తెలుగువారిని కలుసుకుని ప్రచారం చేసిన బండి సంజయ్ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారు. బెంగళూరులోని యలహంకతో పాటు కోలారు జిల్లా మళబాగిల్ లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బండి సంజయ్ ప్రచారం చేశారు.

ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండి సంజయ్ మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీల విజయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు డబ్బులు పంపిస్తున్నారని, ఆ డబ్బుతో ఈ రెండు పార్టీలు బీజేపీని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, జేడీఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపిందని, ఈ రెండు పార్టీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ డీల్ మాట్లాడుకుని వారికి కావలసిన డబ్బులు ఇస్తున్నారని తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లేనిపోని గొడవలు జరుగుతాయని బండి సంజయ్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ జయంతి జరుపునే పార్టీలకు మీరు ఓట్లు వేస్తారా ?. టిప్పు సుల్తాన్ దేవుడు అని చెప్పుకునే నాయకులను మీరు ఆదరిస్తారా, కర్ణాటకలో అలాంటి నాయకులకు మీరు పట్టం కడుతారా అని బండి సంజయ్ ఓటర్లను ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను గాలికి వదిలేస్తున్న కేసీఆర్ పక్క రాస్ట్రాల మీదపడికొట్టుకుంటున్నారని, పదేపదే మహారాష్ట్రకు వెళ్లి అక్కడ కాలం గడుపుతున్నారని, కేసీఆర్ తీరు చూస్తుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాకిప్తాన్ కు వెళ్లి అక్కడకూడా ఎన్నికల ప్రచారం చేసేటట్లు ఉన్నారని తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని గుర్తించిన కేసీఆర్ మహారాష్ట్ర, కర్ణాటకలో చక్రం తిప్పాలని కలలు కంటున్నారని, అక్కడి ప్రజలు ఆయన్ను ఛీకొట్టినప్పుడు ఆయనకు అసలు మ్యాటర్ తెలుస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు. కర్ణాటకలోని ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కర్ణాటకలోని తెలుగు ప్రజలకు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications