థర్డ్‌ఫ్రంట్‌పై శివసేన క్లారిటీ: కాంగ్రెస్‌ను కలుపుకొంటేనే: కెసీఆర్‌‌కు ఆ కెపాసిటీ ఉంది: సంజయ్ రౌత్

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టానికి తొలి అడుగు పడింది. మూడో కూటమి దిశగా సుదీర్ఘ కాలంగా తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కసరత్తు ముమ్మరం చేశారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ఆయన సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌నూ కలుసుకున్నారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు గురించే వారి మధ్య ప్రధానంగా చర్చలు సాగాయి.

Recommended Video

    CM KCR - Prakash Raj Surprise Move దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం | Third Front | Oneindia Telugu

    2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది..దాని దూకుడును ఎలా అడ్డుకోవాల్సి ఉంటుందనే విషయం ఆయా నాయకుల మధ్య ప్రస్తావనకు వచ్చింది. తన ఉద్దేశం ఏమిటనేది కేసీఆర్ స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి దేశంలో సానుకూల వాతావరణం ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.

    Telangana CM KCR has the ability to lead by taking everyone along: Shiv Sena leader Sanjay Raut

    ఈ భేటీపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ రహిత్ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించడం అనేది దాదాపు అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటవుతుందని తాము ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రహిత ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించనప్పుడూ తాము అభ్యంతరం చెప్పాలని అన్నారు.

    కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని పోవాల్సి ఉంటుందని తాము మమత బెనర్జీకి వివరించామని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అన్ని పార్టీలను కూడా కలుపుకొని వెళ్లే సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లే విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏమిటనేది అధికారికంగా తెలియరావాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని పార్టీలను కలుపుకొంటేనే కూటమి ఏర్పాటు సాధ్యపడుతుందని తేల్చి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+