టీ వేడి: బిజెపి నేతలకు పిఎం విందు, భేటీల జోరు

బిజెపి అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీకి ప్రధాని స్వయంగా ఫోన్ చేసి వారిని విందుకు ఆహ్వానించారు. అయితే ఈ రోజే విందు జరగాల్సి ఉండగా, అద్వానీ అందుబాటులో లేకపోవడంతో ఎల్లుండికి వాయిదా పడింది. ప్రస్తుతం అద్వానీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బిజెపి డిమాండ్లను అంగీకరించేందుకు ప్రధాని సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. దీంతో రేపు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాజ్యసభలో ప్రవేశట్టేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్లున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్రమంత్రులు రాజీవ్ శుక్లా, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, కమల్‌నాథ్‌లు చర్చలు జరిపారు.
ఢిల్లీలో సమైక్య, తెలంగాణవాదుల ఆందోళనలు సోమవారం జరిగాయి. విభజనకు వ్యతిరేకంగా ఎపి భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications