తెలంగాణ రాష్ట్ర సమితి( TRS) పార్టీ ఫండ్ ఎంతో తెలుసా?? ఒక్క సంవత్సరంలోనే అంత...
ప్రస్తుత పరిణామాల్లో రాజకీయ పార్టీని నడపడటం అంత ఆషామాషీ కాదు. ఏ పార్టీ దగ్గర ఎంత ఎక్కువగా సొమ్ములుంటే ఆ పార్టీ తన విస్తరణపై అంతగా దృష్టి సారిస్తుంది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను బలంగా ఢీకొట్టడానికి అవకాశం ఉంటుంది. తమ పార్టీ దగ్గర ఎంత నగదు ఉంది? తాము ఎలా ఖర్చు చేస్తున్నాం? ఎక్కడెక్కడి నుంచి విరాళాలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలను అందజేస్తుంది.
2020-21లో తమకు అందిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమాచారం అందించాయి. వీటిని కూలంకుషంగా పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రాంతీయ పార్టీల విరాళాల్లో ఎక్కువ నిధులు ఐదు పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. ఈ ఐదు పార్టీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), డీఎంకే, ఆప్, ఇండియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి.

ఏడీఆర్ నివేదిక ఆధారంగా వివరాలు..
2020-21లో 27 ప్రాంతీయ పార్టీలకు విరాళాలు 3051 మంది అందించారు.
అందిన సొమ్ము రూ.124.53 కోట్లు.
వీటిలో ఐదు పార్టీలకు రూ.113.79 కోట్లు
మొదటిస్థానంలో జేడీయూ ఉంది. ఈ పార్టీకి అత్యధికంగా రూ.60.15 కోట్లు వచ్చాయి.
రెండోస్థానంలో ఉన్న డీఎంకేకు రూ.33.99 కోట్లు
మూడోస్థానంలో నిలిచిన ఆప్ కు రూ.11.32 కోట్లు
నాలుగో స్థానంలో ఐయూఎంఎల్ కు రూ.4.16 కోట్లు
ఐదోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.4.15 కోట్లు వచ్చాయి.
2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగాయని జేడీయూ, తెలంగాణ రాష్ట్ర సమితి, డీఎంకే ప్రకటించాయి.
తమకు విరాళాలు తగ్గినట్లు ఆప్, ముస్లిం లీగ్ వెల్లడించాయి.
టీఆర్ఎస్, జేడీయూ, డీఎంకే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలకు వచ్చిన విరాళం 2019-20తో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications