వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా నెక్స్ట్ టార్గెట్..తెలంగాణ: భ్రమల్లో టీఆర్ఎస్: అనూహ్య ఫలితాలు: రామ్ మాధవ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. తన నాలుగు రాష్ట్రాలను తాను నిలబెట్టుకోగలిగింది. ఈ నాలుగు చోట్ల కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా.. కాషాయమయం అయ్యాయి. ఈ నాలుగింటితో పాటు పంజాబ్‌లో కాంగ్రెస్ మాయమైంది.

ఒంటిచేత్తో విజయం..

ఒంటిచేత్తో విజయం..

ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం వీచింది. ఒంటి చేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చారాయన. ఉత్తరాఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని అంచనా వేసినప్పటికీ అవి తలకిందులయ్యాయి. ఇక్కడ బీజేపీ విజయం నల్లేరు మీద నడకే. మణిపూర్‌లో పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలానికి బీజేపీ ఒక్క సీటు దూరంలో ఆగింది.

పంజాబీలు ఫిదా..

పంజాబీలు ఫిదా..

స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అనూహ్యంగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా లబ్ది పొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది- ఆమ్ ఆద్మీ. తన పరిధిని పంజాబ్‌కు విస్తరించుకోగలిగింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేసింది. బీజేపీ ప్రభంజనాన్ని సమర్థవంతంగా అడ్డుకోలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన సామర్థ్యానికి పంజాబీలు ఫిదా అయ్యారు. ఢిల్లీ మోడల్ పాలనకు పట్టం కట్టారు.

అన్ని చోట్లా గెలుపు..

అన్ని చోట్లా గెలుపు..

ఇక వచ్చే సంవత్సరం మరిన్ని రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీజేపీ సమాయాత్తమౌతోంది. తమ తరువాతి లక్ష్యం తెలంగాణేనని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో తాము అధికారంలో రావడం ఖాయమైందని ఆయన పేర్కొన్నారు.

భ్రమల్లో ప్రాంతీయ పార్టీ..

భ్రమల్లో ప్రాంతీయ పార్టీ..

తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొందని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఓ ప్రాంతీయ పార్టీ పాలిస్తోందని, అది జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనే భ్రమల్లో ఉందని రామ్ మాధవ్ పరోక్షంగా టీఆర్ఎస్‌ను ఉద్దేశించి చెప్పారు. ఆ భ్రమలు వాస్తవ రూపం దాల్చబోవని స్పష్టం చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని, అదే సమయంలో తెలంగాణలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం..

పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం..

ఈ మేరకు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఆయన ప్రత్యే కథనాన్ని రాశారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని రామ్ మాధవ్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఎం కే స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌ను కలుసుకొన్న ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఓ ప్రాంతీయ పార్టీ- జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం భ్రమే అవుతుందని పేర్కొన్నారు.

అవినీతి రహిత పాలన..

అవినీతి రహిత పాలన..


నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గల కారణాలను తన కథనంలో వివరించారు రామ్ మాధవ్. వారసత్వం, కుటుంబ రాజకీయాలకు బీజేపీ చెక్ పెట్టిందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలకు తెర తీసిందని, ప్రజలు బీజేపీని విశ్వసించడానికి ఇదే ప్రధాన కారణమని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అవినీతి రహిత పాలన అందించారని, శాంతిభద్రతలను కాపాడ గలిగారని చెప్పారు. తన పరిపాలనతో ఆయన దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకొనేలా చేసుకోగలిగారని అన్నారు.

English summary
The end of next year Rajasthan, Chattisgarh, Madhya Pradesh and Telangana will face elections the first three states will most likely see BJP back in power. Presently Telangana ruled by a regional party with grand national illusions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X