ప్రాణంతీసిన చాటింగ్: మాంచెస్టర్లో తెలుగు విద్యార్థి మృతి

రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తూ అటు ఇటు నడుస్తూ ప్లాట్ ఫారం అంచులకు వెళ్లాడు. అదే సమయంలో వెనుకనుంచి రైలు వచ్చింది. దానిని సుజిత్ గమనించలేదు. అతి వేగంగా వస్తున్న ఆ రైలుకు అక్కడ స్టాప్ లేకపోవడంతో అది ఆగలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫారమ్ అంచుల వద్ద ఉన్న సుజిత్‌ను రైలు ఈడ్చుకుపోయింది.
చదువుకోవాలనుకున్న విశ్వవిద్యాలయానికి చేరకముందే, ఆ దేశంలో దిగి ఇంకా ఒక్క రోజు కూడా గడవకముందే సుజిత్ చాటింగ్‌కు బలి అయ్యాడని కుటుంబం కన్నీరు మున్నీరయింది. ప్లాట్ ఫారంపై దొరికిన సుజిత్ బ్యాగ్‌ను బట్టి మాంచెస్టర్ పోలీసులు సుజిత్ గురించి తెలుసుకుని స్థానికంగా ఉన్న గార్డియన్ ద్వారా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. లండన్‌కు చెందిన స్థానిక తెలుగు సంస్థ సహకారంతో సుజిత్ మృతదేహాన్ని భారత్ పంపిస్తున్నారు.












Click it and Unblock the Notifications