చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Temple: గుడిలో పురాతన విగ్రహం, వెండి మెట్టలు చోరీ, 8 ఏళ్ల తరువాత అర్చకులు అరెస్టు, నకిలివి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: పురాతనమైన ప్రముఖ ఆలయంలో చోరీ అయిన స్వామివారి మెట్టల కేసులో పోలీసులు ఇద్దరు అర్చకులను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. పురాతన ఆలయంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారి మోట్టలు చోరీ అయ్యాయి. ఆ సందర్బంలో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేశారు. కొంతకాలం తరువాత స్వామివారి మొట్టలు మళ్లీ ఆలయంలో ప్రత్యక్షం అయ్యాయి. ఆలయంలో స్వామివారి మొట్టలు చోరీ చేసిన నిందితులు మళ్లీ గుడిలో ఆ మెట్టలు వదిలేసి వెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. అయితే బంగారు నగల తయారు చేసే వ్యాపారి దగ్గర స్వామివారి నకిలి మొట్టలు తయారు చేయించి గుడిలో పెట్టారని ఇప్పుడు వెలుగు చూసింది. స్మగ్లర్లతో చేతులు కలిపిన అర్చకులు పురాతన ఆలయంలో స్వామి వారి మొట్టలు చోరీ చేసి వాళ్లకు ఇచ్చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

Girlfriend: గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ లో టెక్కీ ఎంజాయ్, పోర్న్ సైట్ అతని వీడియో అతనే చూసి !Girlfriend: గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ లో టెక్కీ ఎంజాయ్, పోర్న్ సైట్ అతని వీడియో అతనే చూసి !

 పురాతన ఆలయం

పురాతన ఆలయం

తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని తిరు ఇందలూరులో పరిమళ రంగనాథర్ పెరుమాల్ ఆలయం ఉంది. పురాతనమైన పరిమళ రంగనాథర్ ఆలయంలో పురాతన వస్తువులు, విగ్రహాలు, కలాకృతులు, శాసనాలు ఉన్నాయి.పరిమళ రంగనాథర్ ఆలయంలో ఏవైపు కోరికలు కోరుకుంటే తప్పకుండా నేరవేరుతాయని భక్తులకు ఎంతోనమ్మకం

 2014లో ఆలయంలో స్వామివారి మెట్లు మాయం

2014లో ఆలయంలో స్వామివారి మెట్లు మాయం

2014వ సంవత్సరంలో పురాతన పరిమళ రంగనాథర్ ఆలయంలో స్వామివారి మోట్టలు చోరీ అయ్యాయి. మరుసటి రోజు స్వామివారి మెట్లు చోరీ అయ్యాయని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆ సందర్బంలో స్వామివారి భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో పోలీసులు 10 సెక్షల కింద కేసు విచారణ వేగవంతం చేశారు.

 ఆలయంలో ప్రత్యక్షం అయిన స్వామివారి మెట్లు

ఆలయంలో ప్రత్యక్షం అయిన స్వామివారి మెట్లు

పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేశారు. కొంతకాలం తరువాత పోలీసుల విచారణ నత్తనడకన సాగింది. కొంతకాలం తరువాత స్వామివారి మొట్టలు మళ్లీ పరిమళ రంగనాథర్ ఆలయంలో ప్రత్యక్షం అయ్యాయి. ఆలయంలో స్వామివారి మొట్టలు చోరీ చేసిన నిందితులు దేవుడికి భయపడి మళ్లీ గుడిలో ఆ మెట్టలు వదిలేసి వెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. స్వామి వారి మొట్టలు వెండితో తయారు చేశారు.

Recommended Video

శరవేగంగా మస్తాబవుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం!!
 నకిలి మొట్టలు తయారు చేశారని తెలిసి షాక్

నకిలి మొట్టలు తయారు చేశారని తెలిసి షాక్

ఇటీవల ఈ కేసు విచారణ మళ్లీ తెరమీదకు వచ్చింది. మైలాదురైలోని ఓ బంగారు నగల వ్యాపారి దగ్గర 15 కేజీల వెండితో స్వామివారి నకిలి మొట్టలు తయారు చేయించి గుడిలో పెట్టారని ఇప్పుడు వెలుగు చూసింది. ఇదే కేసులో ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్న శ్రీనివాస రంగా బట్టర్, మురళీధక్ దీక్షితులను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లతో చేతులు కలిపిన అర్చకులు శ్రీనివాస రంగా బట్టర్, మురళీధక్ దీక్షితులు పురాతన ఆలయంలో స్వామి వారి మొట్టలు చోరీ చేసి వాళ్లకు ఇచ్చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. పురాతన ఆలయంలో చోరీ చేసిన విగ్రహాలు, వస్తువులు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు విదేశాల్లో వాటిని విక్రయిస్తున్నారని ఇప్పటికే తమిళనాడు పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు గుడిలో పని చేస్తున్న ఇద్దరు అర్చకులు స్వామివారి మొట్లు చోరీ చేసి వాటిని విక్రయించిన స్మగ్లర్ల వివరాల కోసం పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద గుడిలో జరిగిన పురాతన ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు ప్రధాన అర్చకులు అరెస్టు కావడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Temple: 2 priest from Perumal temple arrested for stealing silver in Mayiladuthurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X