నాలుగు పడవల బోల్తా, 10 మంది మృతి, పలువురి గల్లంతు

Posted By:
Subscribe to Oneindia Telugu

దిస్‌పూర్‌: అసోంలోని గోల్‌పారా జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తుపాను దాటికి సబన్‌ నదిలో నాలుగు పడవలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు.

సబన్‌ నదిలో నిర్వహించిన పడవ పందేలను తిలకించిన 50 మంది నాలుగు పడవల్లో తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Ten people drown as four boats capsize in Sabon river in Assam's Goalpara district

గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు .

గల్లంతైనవారు ఎంతమంది ఉంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఈ ఘటన గోల్‌పారా జిల్లాలో విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ten people drowned when four boats capsized in Sabon river during a severe storm in Assam's Goalpara district, a senior district administration official said on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి