Tension: దర్గాలో శివలింగానికి పూజలు, కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలపై రాళ్లదాడి, 167 మంది అరెస్టు, షాక్ !

బెంగళూరు/అలంద: దర్గాలో ఉన్న శివలింగానికి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు పూజలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థల నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించారని నమోదు అయిన కేసుల్లో 167 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కేసుల్లో ఇంకా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లాడ్లే మషక్ దర్గాలో శివలింగానికి పూజలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రితో పాటు, బీజేపీ ఎమ్మెల్యేలు, వారి వాహనాల మీద ముస్లీం వర్గానికి చెందిన కొందరు రాళ్లతో దాడి చేశారని ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. శివలింగానికి పూజలు చెయ్యడానికి కేంద్ర మంత్రి, బీజేపీలు వెళ్లడం, అదే రోజు లాడ్లే మషక్ దర్గాలో ముస్లీంలు ప్రత్యేక పూజలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అలందలో బంద్ వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా పోలీసులు దర్శనం ఇస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

 దర్గాలో శివలింగం

దర్గాలో శివలింగం

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అళంద పట్టణంలోని లాడ్లే ముషక్ దర్గా ఉంది. ఈ దర్గాలో రాఘవ చైతన్య శివలింగం ప్రతిష్టాపన జరిగింది. దర్గాలో ఉన్న శివలింగం దగ్గర కొందరు గలీజు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది. శివరాత్రి రోజు శివలింగాన్ని శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేస్తామని ఇటీవల హిందూ సంఘ, సంస్థలు ప్రకటించాయి.

 కేంద్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేలు

కేంద్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేలు

అళందలోని లాడ్లే మషక్ దర్గాలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చెయ్యడానికి కేంద్ర మంత్రి, బీదర్ ఎంపీ భగవంత ఖూబా, బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ ముత్తిమూడ, రాజ్ కుమార్ పాటిల్ తదితరులు శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు చెయ్యడానికి వెళ్లారు. ఆ సమయంలో అళందలోని దర్గా దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రాజీ చేసి పంపించిన ఎస్పీ, కలెక్టర్

రాజీ చేసి పంపించిన ఎస్పీ, కలెక్టర్

శివలింగానికి పూజలు చెయ్యడానికి కేంద్ర మంత్రి, బీజేపీలు వెళ్లడం, అదే రోజు లాడ్లే మషక్ దర్గాలో ముస్లీంలు ప్రత్యేక పూజలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఇరు వర్గాలతో శాంతి చర్చలు జరిపిన జిల్లా ఎస్పీ ఇషా పంత్, జిల్లా కలెక్టర్ యశవంత్ గురుకర్ 12 మంది మాత్రమే దర్గాలోకి వెళ్లి శివలింగానికి ప్రత్యేక పూజలు చెయ్యడానికి అవకాశం ఇచ్చారు.

 కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేల మీద రాళ్లదాడి

కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేల మీద రాళ్లదాడి

దర్గాలో పూజలు చెయ్యడానికి వెలుతున్న సమయంలో కేంద్ర మంత్రి భగవంత ఖూబా, బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ ముత్తిమూడ, రాజ్ కుమార్ పాటిల్ బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థల నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఒక్కసారిగా దర్గా పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల మీద నుంచి రాళ్లదాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 ఐదు కేసులు.....167 మంది అరెస్టు

ఐదు కేసులు.....167 మంది అరెస్టు

దర్గాలో పూజలు చెయ్యడానికి వెలుతున్న సమయంలో కేంద్ర మంత్రి భగవంత ఖూబా, బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ ముత్తిమూడ, రాజ్ కుమార్ పాటిల్ బీజేపీ నాయకులు, హిందూ సంఘ, సంస్థల నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించిన సంఘటనలో పోలీసులు ఐదు కేసులు నమోదు చేసి ఐదు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 167 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

 రంగంలోకి అదనపు పోలీసు బలగాలు

రంగంలోకి అదనపు పోలీసు బలగాలు

అళందలో ప్రస్తతం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అళంద పట్టణంలోని శ్రీరామ మార్కెట్, రజ్వి రోడ్డు, దర్గా చౌక్, తహశిల్దార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో బంద్ వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా పోలీసులు దర్శనం ఇస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+