చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో పెట్రోల్ బాంబులతో దాడి, మహిళా పోలీసులను లోపలపెట్టి !

జల్లికట్టు ఆందోళన సమయంలో మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి పోలీస్ స్టేషన్ తో పాటు ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న 50 ద్విచక్రవాహనాలు,

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు ఆందోళనతో చెన్నై నగరంలో పలు వాహనాలు దగ్దం అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టడానికి ప్రయత్నించిన సమయంలో వారు రెచ్చిపోయారు.

మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. పోలీస్ స్టేషన్ తో పాటు ఆ ప్రాంగణంలో నిలిపి ఉన్న 50 ద్విచక్రవాహనాలు, జీపులకు నిప్పంటించారు.

విద్యార్థులు, యువకులతో పెట్టుకుంటే ఇదే గతి (ఫోటో గ్యాలరీ)

పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మహిళా పోలీసులతో సహ 16 మంది పోలీసులను లోపలపెట్టి బయట తాళం వేసి నిప్పంటించి సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించారని. అదే సమయంలో తాము అటు వైపు వెళ్లిన విషయం గుర్తించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పారిపోయారని సాటి పోలీసులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు.

Tension and violence continued in Chennai even after the Jallikattu protest at Marina was withdrawn

పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు కిటికీలు పలగొట్టుకుని, వెనుక తలుపుల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారని అధికారులు అంటున్నారు. చెన్నైలోని కొన్ని చోట్లు 10 కార్లకు నిప్పంటించారని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు !

ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు, 27 రైలు సర్వీసులు రద్దు చేశారు. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపుచెయ్యడంతో సామాన్య ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

500 మంది ఆందోళనకారులకు తీవ్రగాయాలైనాయి. ఆందోళకారులు రాళ్లురువ్వడంతో 27 మంది పోలీసులకు గాయాలైనాయి. వాహనాలకు నిప్పంటించారని, పోలీసుల మీద దాడి చేశారని ఆరోపిస్తూ పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
The Ministry for Home Affairs is closely monitoring the situation in Chennai after the Jallikattu protests turned violent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X