Killer: ఉదయ్ పూర్ హత్యకు ఆరు కసాయి కత్తులు స్వయంగా తయారు చేసిన రియాజ్, పాకిస్తాన్ లో ?, అమిత్ షాకు !
ఉదయ్ పూర్/ రాజస్థాన్: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. టైలర్ కన్హయ్య లాల్ ను హత్య చెయ్యడానికి నిందితుడు రియాజ్ అక్తారీ స్వయంగా ఆరు కసాయి కత్తులు తయారు చేశాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న రియాజ్ అక్తారీ అతను తయారు చేసిన ఆరు కసాయి కత్తుల్లో రెండింటిని టైలర్ కన్హయ్య లాల్ హత్యకు ఉపయోగించాడని విచారణలో నిందితుడు స్వయంగా అంగీకరించాడని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల్లాగా టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు నిందితులు అతికిరాతకంగా హత్య చేసి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

అమరావతిలో, ఉదయ్ పూర్ లో సేమ్ సీన్ రిపీట్
మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ మాజీ నాయకురాలు నపూర్ శర్మాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఇద్దరిని అతికిరాతకంగా హత్య చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఔషద వ్యాపారి ఉమేష్ కౌల్హే, రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను అతికిరాతకంగా హత్య చేశారు.

ఎన్ఐఏ చేతికి రెండు కేసులు
మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21వ తేదీన హత్యకు గురైన ఔషద వ్యాపారి ఉమేష్ కోల్హే కేసుకు, జూ్ 28వ తేదీన ఉదయ్ పూర్ లో హత్యకు గురైన కన్హయ్య లాల్ హత్యకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు రెండు కేసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు హత్యలకు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనే అనుమానంతో కేంద్ర హోమ్ శాఖ ఆ కేసులు ఎన్ఐఏకి అప్పగించింది.

స్వయంగా కసాయి కత్తులు తయారు చేసిన రియాజ్ అక్తారీ
టైలర్ కన్హయ్య లాల్ ను హత్య చెయ్యడానికి నిందితుడు రియాజ్ అక్తారీ స్వయంగా ఆరు కసాయి కత్తులు తయారు చేశాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న రియాజ్ అక్తారీ అతను తయారు చేసిన ఆరు కసాయి కత్తుల్లో రెండింటిని టైలర్ కన్హయ్య లాల్ హత్యకు ఉపయోగించాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితుడు స్వయంగా అంగీకరించాడని అధికారులు అంటున్నారు.

పిన్ టూ పిన్ బయటకు లాగుతున్న ఎన్ఐఏ
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. పాకిస్తాన్ కు చెందిన దావత్ -ఏ-ఇస్లామి ఉగ్రవాద సంస్థతో నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారుల విచారణలో బయటకు వచ్చింది.

పాకిస్తాన్, సౌదీ అరేబియాకు టూర్లు
2014లో గౌస్ అహమ్మద్ పాకిస్తాన్ లోని కరాచీ వెళ్లి 40 రోజులు అక్కడే ఉన్నాడని, ఆ సమయంలో గౌస్ మోహమ్మద్ కు ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చిందని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. 2013, 2019లో గౌస్ మోహమ్మద్ రెండు సార్తు ఉమ్రా కోసం సౌదీ అరేబియా వెళ్లి వచ్చాడని ఎన్ఐఏ అధికారుల విచాణలో వెలుగు చూసింది.

అమిత్ షాకు రెండు కేసుల నివేదిక
ఇద్దరు నిందితులు సౌదీ అరేబియాతో పాటు విదేశాలు తిరిగి వచ్చారని వెలుగు చూసింది. పాకిస్తాన్ కు చెందిన దావత్ -ఏ-ఇస్లామి ఉగ్రవాద సంస్థతో నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా ఈ రెండు కేసులకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను స్వయంగా కలిసి రెండు కేసుల వివరాలు వెళ్లడించారని సమాచారం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications