శ్రీనగర్లో పోలీసు బస్సుపై తీవ్రవాద దాడి-ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
కశ్మీర్లో కొంతకాలంగా పరిస్ధితులు శాంతియుతంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ఇవాళ ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శ్రీనగర్ కు సమీపంలోని జెవాన్ లో రహదారిపై వెళ్తున్న పోలీసు బస్సుపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దీంతో ఈ దాడిలో ఇద్దరు సాయుధ పోలీసులు చనిపోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు.

ఇవాళ సాయంత్రం శ్రీనగర్ శివార్లలోని జెవాన్ వద్ద పోలీసు క్యాంపు సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు పోలీసు బస్సుపై దాడి చేయడంతో ఇద్దరు జమ్ము కశ్మీర్ సాయుధ పోలీసు సిబ్బంది చనిపోయారు. మరో 12 మంది గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వివిధ భద్రతా దళాలకు చెందిన అనేక శిబిరాలు ఉన్న అత్యంత సురక్షితమైన ప్రాంతంలో ఉగ్రవాదులు బస్సుపై భారీ కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఈరోజు సాయంత్రం పంథా చౌక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. గాయపడిన సిబ్బంది అందరినీ తరలించి వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు మరియు దుండగుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Recommended Video
కశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత పరిస్ధితులు వేగంగా మారిపోయాయి. అప్పటివరకూ తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న కశ్మీర్లో పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. చొరబాట్ల సంఖ్య కూడా తగ్గింది. అయితే తాజాగా మళ్లీ దాడులు మొదలయ్యాయి. కశ్మీర్లోకి పండిట్లను రప్పించేందుకు కేంద్రం చేేస్తున్న ప్రయత్నాలు,వాటికి కశ్మీర్లో స్ధానిక ప్రాంతీయ పార్టీల మద్దతు వంటి అంశాలు ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. దీంతో వారు స్ధానికులపై దాడులకు దిగుతున్నారు. ఇప్పుడు ఏకంగా భద్రతా బలగాలనే టార్గెట్ చేశారు. పోలీసు బస్సుపై దాడి చేయడం ద్వారా దాదాపు 20 మందిని పొట్టనపెట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే బలగాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications