దేశాన్ని కుదిపేసిన ఉగ్రకుట్ర భగ్నం: 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

జమ్మూ-కాశ్మీర్ పోలీసులు ఓ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఇటీవల అరెస్టు చేసిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి దాదాపు 360 కిలోల పేలుడు పదార్థం (అమ్మోనియం నైట్రేట్), ఒక AK-47 రైఫిల్, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి గతంలో కూడా ఏకే-47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాశ్మీర్ నుండి ఫరీదాబాద్ వరకు కుట్ర భగ్నం
జమ్మూ-కాశ్మీర్ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. నవంబర్ 8న శ్రీనగర్ పోలీసులు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (GMC) అనంత్‌నాగ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ లాకర్ నుండి AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఆదిల్ అహ్మద్ లాకర్ నుంచి ఏకే-47 రైఫిల్ లభించడంతో, భద్రతా సంస్థలకు అతనికి ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం మరింత బలపడింది. జైష్‌తో అతని సంబంధాలపై విచారణ జరిపినప్పుడు ఆదిల్ మరొక రహస్య స్థావరం (ఫరీదాబాద్) గురించి సమాచారం లభించింది.

Terror Plot Foiled 360 Kg Explosives AK-47 Seized in Jammu Kashmir Police Operation

ఆసుపత్రిపై దాడి.. భారీ మొత్తంలో పేలుడు పదార్థాల స్వాధీనం
ఈ ఆపరేషన్ రెండు కీలక అరెస్టులతో మొదలైంది. అరెస్టు చేయబడిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ విచారణలో వెల్లడించిన కీలక సమాచారం ఆధారంగా, భద్రతా సంస్థలు ఫరీదాబాద్‌లోని అల్ ఫలా ఆసుపత్రి వద్ద దాడులు నిర్వహించాయి. ఆదిల్ అహ్మద్‌తో పాటు ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్ పుల్వామా జిల్లాకు చెందిన ముజామిల్ షకీల్‌ను కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నందుకు అరెస్టు చేశారు. షకీల్ ఫరీదాబాద్‌లో ఈ రసాయనాలను, ఆయుధాలను నిల్వ చేయడానికి సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ ఆసుపత్రి వద్ద స్వాధీనం చేసుకున్న సామగ్రి పరిమాణం, ఏదో పెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. స్వాధీనం చేసుకున్న వాటిలో 360 కిలోగ్రాముల అనుమానాస్పద అమ్మోనియం నైట్రేట్ (ఒక పెద్ద కంటైనర్‌లో), ఒక అసాల్ట్ రైఫిల్ (3 మ్యాగజైన్‌లు, 83 లైవ్ రౌండ్‌లతో), ఒక పిస్టల్ (8 లైవ్ రౌండ్‌లు మరియు 2 అదనపు మ్యాగజైన్‌లతో), 20 టైమర్లు, 24 రిమోట్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ వైరింగ్, బ్యాటరీలు, 5 కిలోల భారీ లోహం, 8 పెద్ద సూట్‌కేసులు, 4 చిన్న సూట్‌కేసులు దొరికాయి.

అరెస్టయిన వీరిద్దరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటన వినియోగించారా అనే విషయంపై పోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ముందుగా ఫరీదాబాదా నంచి 300 కిలోలకు పైగా ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు రాగా.. ఆ తర్వాత ఫరీదాబాద్ సీపీ సతేందర్ కుమార్ స్పందిస్తూ.. అది ఆర్డీఎక్స్ కాదని మండే స్వభావం ఉన్న పదార్థాలు అని వెల్లడించారు. అది స్థానికంగా సేకరించిన అమ్మోనియం నైట్రేట్ అయి ఉండవచ్చని స్పష్టం చేశారు. ఇది జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్ అని ఆయన తెలిపారు.

మరోవైపు దర్యాప్తు వివరాలు ఈ వైద్యుల నెట్‌వర్క్‌పై మరింత అనుమానాలను పెంచుతున్నాయి. డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఆయుధాలు, పేలుడు పదార్థాల నిల్వ మరియు రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అరెస్టు చేయబడిన ఈ వైద్యులు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, గజ్వత్-ఉల్-హింద్‌ లతో సంబంధం కలిగి ఉన్నారని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్‌లో ఈ భారీ స్వాధీనం జరిగిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు పెద్ద ఎత్తున యాంటీ-టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో దాక్కున్న ఉగ్రవాదులు శీతాకాలం ప్రారంభం కావడంతో మైదాన ప్రాంతాలలో సురక్షిత ఆశ్రయాల కోసం వెతుకుతున్నారనే నిఘా సమాచారం ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాంబన్, కిష్త్వార్, దోడా, కథువా, రియాసి, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో సెర్చ్ అండ్ కార్డన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.

అసలు వెలుగులోకి ఎలా వచ్చిందంటే?
జమ్మూకశ్మీర్‌కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకోవడం సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహమ్మద్‌కు మద్దతుగా ఇతను రహస్యంగా పోస్టర్లను అంటిస్తుండగా నిఘా సంస్థలు గుర్తించాయి. సమాచారం అందుకున్న వెంటనే, జమ్మూకశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవల అనంత్‌నాగ్‌ మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో డాక్టర్ ఆదిల్‌కు చెందిన లాకర్‌ను సోదా చేయగా.. అందులో ఏకే-47 రైఫిల్ బయటపడింది. లాకర్‌లో ఏకంగా ఒక ఆటోమేటిక్ రైఫిల్ లభ్యం కావడంతో డాక్టర్ ఆదిల్ అహ్మద్‌తో ఉగ్రవాద సంస్థలకు ఉన్న సంబంధాలపై పోలీసుల అనుమానం మరింత బలపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+