
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్ లో షాకింగ్ కోణం; రంగంలోకి యాంటీ టెర్రర్ ఏజెన్సీ, ఎన్ఐఏ!!
ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచమంతా కలిసి ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన నెలరోజులు కాకముందే ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్ హాకింగ్ ఘటన అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజలలోనూ చర్చనీయాంశమైంది. వారం రోజులైనా ఎయిమ్స్ సర్వర్ కు సైబర్ నేరగాళ్ల చెర నుండి విముక్తి లభించకపోవడంతో ఎయిడ్స్ వ్యవహారం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది.

ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్ ఘటన ... టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ వారం రోజులుగా మాన్యువల్ గా సేవలను అందిస్తోంది. దీనివల్ల అవుట్ పేషెంట్ విభాగం పైన, నమూనా సేకరణ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎయిమ్స్ లో చాలా ఓపిడి అపాయింట్మెంట్లు ఆన్లైన్ లోనే జరుగుతాయి. ప్రస్తుతం ఆన్లైన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో, ఎయిమ్స్ కు వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఇది దేశంలో సైబర్ భద్రత పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.

సైబర్ దాడి వెనుక ఉగ్రవాద కోణం, విదేశీ కుట్ర ఉందని అనుమానం
ఇదిలా ఉంటే ఎయిడ్స్ పై జరిగిన సైబర్ దాడి వెనుక ఉగ్రవాద కోణం, విదేశీ కుట్ర దాగి ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును విచారిస్తున్న ట్లు సమాచారం. అయితే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ తో పాటు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం డేటాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్లు రెండు వందల కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టు ఎయిమ్స్ అధికారులు తమ దృష్టికి తీసుకు రాలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

వారం రోజులు గడిచినా సర్వర్ రికవరీలో ఫెయిల్యూర్
మొత్తానికి ఎయిమ్స్ మెయిన్ సర్వర్ హ్యాకింగ్ విషయంలో కొత్త కొత్త విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. నవంబర్ 23 వ తేదీన హ్యాకింగ్ కు గురైన ఎయిమ్స్ సర్వర్ ను ఇప్పటివరకు రికవరీ చేయలేకపోవడంతో దేశంలో ప్రస్తుతం ఈ వ్యవహారం భారతదేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఒకపక్క సైబర్ దాడులకు చెక్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చెబుతున్న ఈ సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.

ఎయిమ్స్ లో తాజా పరిస్థితి ఇదే
ఇదిలా
ఉంటే
ఎయిమ్స్
లో
ఐదువేల
కంప్యూటర్లు
ఉన్నాయి.
మంగళవారం
నాటికి
వాటిలో
రెండు
వేలకు
పైగా
మార్వెల్
సాఫ్ట్వేర్
కోసం
స్కాన్
చేయబడ్డట్టు
తెలుస్తుంది.
ఎయిమ్స్
లో
నెట్వర్క్
యొక్క
పూర్తి
శానిటైజేషన్
మరో
ఐదు
రోజుల
పాటు
కొనసాగే
అవకాశం
ఉంది.
ఆ
తర్వాత
నే
హాస్పిటల్
సేవలను
ప్రారంభించవచ్చునని
భావిస్తున్నారు.
ప్రస్తుతం
డేటా
సేకరణ
కోసం
ఇ-హాస్పిటల్
సేవలను
పునరుద్ధరించడానికి
ఎన్‌ఐసి
బృందం
నాలుగు
సర్వర్‌లను
ఏర్పాటు
చేసి
యుద్ధ
ప్రాతిపదికన
పని
చేస్తుందని
తెలుస్తుంది.