వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదానికి మతం, జాతి లేదు .. కాంగ్రెస్ నేత సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిని యావత్ ప్రపంచం తప్పుపడుతుంటే .. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదని ఆయన చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీశాయి.

కాంట్రవర్సీ సిద్దూ

కాంట్రవర్సీ సిద్దూ

కాంగ్రెస్ నేత సిద్దూ .. మనస్తత్వం దూకుడు. క్రికెటర్ గా కెరీర్ ఆరంభించిన సిద్దూ .. గ్రౌండ్ లో దుందుకుడు స్వభావంతో ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన స్వభావం మారలేదు. గతంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం కోసం వెళ్లి ఆర్మీ చీఫ్ ఖాదర్ జావేద్ బాజ్వా కౌగిలించుకున్న అంశం కూడా వివాదాస్పదమైంది.

ఒకరు అలా .. మరోకరు ఇలా ...

ఒకరు అలా .. మరోకరు ఇలా ...

పుల్వామా దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. దాడి తర్వాత భద్రతా దళాలు, భారత ప్రభుత్వం వెన్నంటే యావత్ ప్రతిపక్షం ఉంటుందని భరోసానిచ్చారు. ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిగతా రాజకీయ అంశాలకు దాడులకు సంబంధం లేదని .. మనమంతా ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఇలా దేశ హితం కోరి వ్యాఖ్యానిస్తే .. ఆ పార్టీ నేత సిద్దూ మాత్రం విరుద్ధంగా మాట్లాడటం సర్వత్రా విమర్శలకు దారితీసింది. గురువారం ఉగ్రదాడి తర్వాత సిద్దూ మాట్లాడుతూ ... ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదని స్పష్టంచేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న అశాంతి చర్చలు ఒక్కటే పరిస్కారమని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

సిద్దూ కామెంట్స్ పై ఫైర్

సిద్దూ కామెంట్స్ పై ఫైర్

సిద్దూ వ్యాఖ్యలను వివిధ వర్గాలు తప్పుపట్టాయి. ఆయనకు సీఆర్పీఎఫ్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించాయి. ఉగ్ర దాడి సిద్దూ వ్యాఖ్యలు సిగ్గుచేటని రిటైర్డ్ మేజర్ జనరల్ బక్షి ఘాటుగా స్పందించారు.

English summary
A day after 40 CRPF jawans were martyred when explosive-laden SUV rammed into one of the buses out of a 70-vehicle CRPF convoy in Jammu and Kashmir's Pulwama district, Congress leader Navjot Singh Sidhu said: "Terrorism has no religion, no nation". Sidhu also said only talks can resolve India's differences with Pakistan. Sidhu's comment is in sharp contrast to what his party chief Rahul Gandhi had to say on Pulwama attack earlier in the day. Rahul Gandhi on Friday condemned the dastardly attack in Pulwama and said the entire Opposition stands with the government and the security forces. retired Major General GD Bakshi said Sidhu has not faced what the CRPF has, what men in uniform routinely do in conflict areas. Bakshi called Sidhu's comment "shameful".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X