ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం: జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. షోపియాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురుకాల్పులకు దిగారు.
ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పులు ఆదివారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.

కాగా, ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications