పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడు
కాశ్మీర్: కాశ్మీర్ లో మరొ సారి పాకిస్థాన్ ఉగ్రవాదిని భారత్ సైన్యం ప్రాణాలతో పట్టుకునింది. ఉత్తర కాశ్మీర్ లో కొన్ని గంటల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. తరువాత సైన్యం, పోలీసులు ప్రాణాలకు తెగించి ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు.
పాకిస్థాన్ కు చెందిన సజ్జాద్ అహమ్మద్ (22) అనే ఉగ్రవాది ప్రాణాలతో చిక్కిపోయాడు. బుధవారం పాకిస్థాన్ నుండి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో చోరబడ్డారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. విషయం తెలుసుకున్న భారత జవాన్లు, పోలీసులు పాక్ ఉగ్రవాదుల కోసం గాలించారు.
సరిహద్దులోని యురి సెక్టార్ దగ్గర ఉగ్రవాదులు సైన్యం కంట్లోపడ్డారు. 18 గంటల పాటు ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు. ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుని విచారణ చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారులు కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు. ఉదమ్ పూర్ లో పాక్ ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతనిని జమ్మూ కోర్టులో హాజరు పరిచిన రోజే మరొ ఉగ్రవాది సైన్యం చేతికి చిక్కాడు.
పాకిస్థాన్ నుండి నలుగురు కాశ్మీర్ లోకి చోరబడ్డామని పట్టుబడిన ఉగ్రవాది అధికారులకు చెప్పాడని సమాచారం. అయితే ఎంత మంది ఉగ్రవాదులు భారత్ లో చోరబడ్డారు అని అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాదిని రహస్య ప్రాంతంలో మిలటరి అధికారులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications