ఆర్మీ క్యాంప్‌పై దాడి, ఆర్మీ మేజర్, జవాన్లు మృతి: ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతం

జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆర్మీ క్యాంప్ పైన తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. తీవ్రవాదుల దాడితో సైన్యం వెంటనే అప్రమత్తమయింది.

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆర్మీ క్యాంప్ పైన తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. తీవ్రవాదుల దాడితో సైన్యం వెంటనే అప్రమత్తమయింది. సైన్యం, తీవ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

దాదాపు వంద మంది తీవ్రవాదులు జమ్ము కాశ్మీర్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇది జరిగిన తర్వాత రోజే కుప్వారాలో తీవ్రవాదులు ఆర్మీ క్యాంప్ పైన దాడి చేయడం గమనార్హం.

jammu and kashmir

తీవ్రవాదులు సూసైడ్ అటాక్‌కు పాల్పడ్డారు. అయితే, అప్రమత్తమైన సైన్యం తిప్పికొట్టింది. ఇద్దరు తీవ్రవాదులను హతమార్చింది. మరో ఇద్దరు లొంగిపోయారు. ఆ తీవ్రవాదులు హిజ్బుల్ ముజహిదీన్‌కు చెందిన వారు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

కాగా, ఈ వంద మంది తీవ్రవాదులను పాకిస్తాన్... పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోకి చొప్పించిందని తెలుస్తోంది. పాకిస్తాన్ తీవ్రవాదులకు సాయం చేస్తూ, కాశ్మీర్‌లోకి పంపించడం ద్వారా జమ్ము కాశ్మీర్‌లో నిరంతర ఆందోళనళకు కుట్ర పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+