"పోయి నీ మోదీకి చెప్పు చావు" ఇంత భయకరంగా ఉంటుందని
లష్కరే తోయిబా (LET) ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 27 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి. పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడిలో దాదాపు 27 మంది మరణించారు.
మరోవైపు, కాల్పులు జరిపిన అనంతరం, బాధితులతో ఉగ్రవాదులు.. ''పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు'' అన్నారు. చనిపోయిన వ్యక్తి భార్యతో ఈ ఊచకోత గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెప్పమని అతను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద చర్య వారి క్రూరత్వాన్ని విధానం ఎలా ఉందో చెబుతుంది.

మరోవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని హఠాత్తుగా భారతదేశానికి తిరుగు పయనమయ్యారని సమాచారం అందుతుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి మానవత్వానికే మాయని మచ్చ అని ఆయన అన్నారు.అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడి జరగడంతో ఆయన సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి పయనమయ్యారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications