రెచ్చిన ఉగ్రవాదులు: కాశ్మీర్ ఎమ్మెల్యే ఇంటిపై గ్రనేడ్లతో దాడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్‌లో ఎమ్మెల్యే మహమ్మద్ యూసఫ్ భట్ ఇంటిపై బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్, యూరీ దాడి, సర్జికల్ దాడుల అనంతరం ఈ సరిహద్దు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడి
దక్షిణ కాశ్మీరులోని కుల్గాం జిల్లా, యారిపోరాలో పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు మంగళవారం సాయంత్రం ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొద్ది దూరం నుంచి కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు ధీటుగా ప్రతిఘటించారు. కొద్ది సమయం పాటు పరస్పర కాల్పులు కొనసాగాయి.
కొద్ది సేపటి తర్వాత ఉగ్రవాదులు చీకటిని ఆసరగా చేసుకుని పారిపోయారు. ఇదే ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ ఔట్‌పోస్ట్ నుంచి ఉగ్రవాదులు సోమవారం ఆయుధాలను తస్కరించుకెళ్లారు. వీటిలో ఐదు సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు (ఎస్‌ఎల్‌ఆర్), పది మేగజైన్లు, 250 తూటాలు ఉన్నాయి. పోలీసు గార్డులపై దాడి చేసి వీటిని తస్కరించుకెళ్లారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు.












Click it and Unblock the Notifications