బాల్ థాక్రే వల్లకానిది ఫడ్నవీస్ చేసిపెట్టారు..! 20 ఏళ్ల తర్వాత ఏకమైన ఉద్ధవ్-రాజ్..!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు. దివంగత శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే రాజకీయ వారసత్వం కోసం మొదలైన పోరులో రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన సోదరులు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే తిరిగి ఏకమయ్యారు. హిందీ భాషను బలవంతంగా స్కూళ్లలో పిల్లలపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా పోరు ప్రారంభించిన వీరిద్దరి ధాటికి.. మహాయుతి సర్కార్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలో మెగా విక్టరీ ర్యాలీని వీరు నిర్వహిస్తున్నారు.
20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే, ఆయన కజిన్ రాజ్ థాక్రే తిరిగి ఒక్కటయ్యారు. గతంలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సజావుగా సాగిపోతున్న తరుణంలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి శివసేనను చీల్చారు. బీజేపీ సాయంతో మహరాష్ట్రలో సీఎం కూడా అయ్యారు. దీంతో శివసేనలో చీలిక వర్గాల మధ్య పోరు సాగింది. చివరికి గత ఎన్నికల్లో ఓటర్లు ఏక్ నాథ్ షిండే శివసేన వైపే మొగ్గు చూపడంతో ఆయనదే అసలు వర్గంగా మారింది.

ఈ నేపథ్యంలో సోదరుడు ఉద్ధవ్ థాక్రేకు అండగా నిలవాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర స్కూళ్లలో హిందీ భాషను బలవంతంగా రుద్దాలన్న బీజేపీ కూటమి సర్కార్ నిర్ణయం వీరికి కలిసొచ్చింది. దీంతో ఇదే అదనుగా మరాఠా వాదంతో పోరు ప్రారంభించిన థాక్రే సోదరులు చివరికి అనుకున్నది సాధించారు. ప్రభుత్వం మెడలు వంచడమే కాకుండా రెండు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చేశారు.
#WATCH | Mumbai: Brothers, Uddhav Thackeray and Raj Thackeray share a hug as Shiv Sena (UBT) and Maharashtra Navnirman Sena (MNS) are holding a joint rally as the Maharashtra government scrapped two GRs to introduce Hindi as the third language.
— ANI (@ANI) July 5, 2025
(Source: Shiv Sena-UBT) pic.twitter.com/nSRrZV2cHT
ఈ నేపథ్యంలో విక్టరీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన రాజ్ థాక్రే.. అప్పట్లో బాల్ థాక్రే చేయలేని పనిని ఇప్పుడు సీఎం ఫడ్నవీస్ చేశారంటూ సెటైర్లు వేశారు. అప్పట్లో బాల్ థాక్రే తమ ఇద్దరు సోదరుల్ని కలిపి ఉంచలేకపోయారని, కానీ ఇప్పుడు ఫడ్నవీస్ హిందీ భాషపై తీసుకున్న నిర్ణయంతో తమను తిరిగి ఏకం చేసారనేది దాని సారాంశం. ఇక తమ పోరాటం కారణంగా ప్రభుత్వం హిందీ భాష అమలుపై వెనక్కి తగ్గడంపై ఉద్ధవ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications