ఘోర ప్రమాదం: నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలి, ఆరుగురు మృతి, శిథిలాల్లో మరికొందరు

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్‌నగర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల సాయి శక్తి భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

 Thane: Six dead as part of building collapses in Ulhasnagar

మృతులను కృష్ణ బజాజ్, దినేశ్ చంద్వానీ, మోహిని చంద్వానీ, పునీత్ చంద్వానీ, నమ్రత బజాజ్, దీపక్ చంద్వానీలుగా గుర్తించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recommended Video

    Sonu Sood Arranges Buses For Migrants Stuck In Mumbai

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+