ఎన్నికల వేళ.. కీలక గెజిట్ జారీ చేసిన ఈసీ

Lok Sabha election 2024: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగుస్తుంది.

అటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. తొలి విడత పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనూ దశలవారీగా పూర్తి చేస్తోన్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లోని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలు ఖరారు కావడం వల్ల ఆయా చోట్ల ప్రచారం పీక్స్‌కు చేరుకుంది.

The 2nd phase of Lok Sabha elections 2024 begins March 28

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా సరికొత్త గెజిట్‌ను జారీ చేసింది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన గెజిట్ అది. గురువారం నుంచి రెండో దశ లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 4. 6వ తేదీ వరకు స్క్రూటినీ ఉంటుంది.

నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 8వ తేదీ తుది గడువు. ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ ఉంటుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లల్లో రెండో విడతలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. లోక్‌సభలో ఎన్డీఏ- ఇండియా కూటమి మధ్య ప్రధానంగా ఎన్నికల పోటీ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+