Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాటర్ బాటిల్ లో విస్కీ మిక్స్ చేసి బస్ స్టాండ్ లో మహిళకు ఇచ్చి ఏం చేశారంటే ? !

ఐదు రోజుల క్రితం బస్టాండ్‌లో ఓ మహిళకు వాటర్ బాటిల్‌లో మద్యం కలిపి ఇచ్చి ఆమె స్పృహ తప్పిన తరువాత అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. బహిరంగ ప్రదేశాలలో, బస్టాప్‌ల వద్ద అపరిచిత వ్యక్తులు అందించే ఆహారం, నీరు, శీతలపానీయాలు తాగవద్దని చిన్నారులు, మహిళలు, ఇతరులకు ఎన్నిసార్లు పోలీసులు వార్నింగ్‌లు ఇచ్చినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

కర్ణాటకలోని మంగళూరులోని సమీపంలోని పుత్తూరు బస్టాండ్ లో (దక్షిణ కన్నడ జిల్లా)లో ఓ మహిళకు వాటర్ బాటిల్ లో మద్యం కలిపి తాగించాడు. ఆ తర్వాత మద్యం తాగిన మహిళ స్పృహతప్పింది. వెంటనే ఆమెను సల్మారా అనే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమెను వదిలేసి వెళ్లిపోయారని వెలుగు చూసింది. తరువాత స్పృహలోకి వచ్చిన మహిళ పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

The accused mixed liquor in a water bottle at the bus stand and forced the woman to drink and raped her

ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకాలోని సల్మారాలో చోటుచేసుకుంది. ఈ ఘటన నవంబర్ 24వ తేదీన పుత్తూరు సమీపంలో జరిగింది. నిందితుడు పుత్తూరులోని ఆర్యాపు గ్రామానికి చెందిన సంషుద్దీన్ అస్గర్ అలీ(23)గా గుర్తించామని పోలీసులు అన్నారు. నిందితుడు ఆలీ పుత్తూరు వాసి కాగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. అత్యాచారానికి గురైన మహిళ హసన్ జిల్లా చెన్నరాయపట్నంకు చెందినదిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

నవంబరు 24వ తేదీన పుత్తూరు బస్టాండ్ సమీపంలో వాటర్ బాటిల్‌లో మద్యం కలిపి మహిళకు బలవంతంగా తాగించారని, తరువాత ఆమె స్పృహ తప్పిన తరువాత ఆహెను అక్కడి నుంచి సాల్మారాకు తీసుకెళ్లాడుని, తరువాత

నిందితుడు షంసుద్దీన్ అస్గర్ అలీ మహిళ ప్రతిఘటించినా పట్టించుకోకుండా ఆమె మీద అత్యాచారం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఘటన తర్వాత నిందితుడు ఆలీ నుంచి తప్పించుకున్న మహిళ మద్యం మత్తులో రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయింది.

The accused mixed liquor in a water bottle at the bus stand and forced the woman to drink and raped her

రోడ్డు పక్కన మద్యం మత్తులో పడి ఉన్న మహిళను గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. పుత్తూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మహిళ స్పృహలోకి రావడంతో ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఆలీ కోసం గాలించి చివరికి బుధవారం అతన్ని పుత్తూరు సమీపంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే జీహాద్ సభ్యులు మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి ఉంటారని, పోలీసులు లోతుగా విచారణ చెయ్యాలని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+