ఐవోసీ ఉద్యోగం ఇస్తే ఐఎస్ఐఎస్ కు మార్కెటింగ్
జైపూర్/కలబుర్గి: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మార్కెటింగ్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులలో చేరాలని ప్రజలను ప్రోత్సహిస్తున్న నిందితుడిని రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రత్యేక బృందం అధికారులు అరెస్టు చేశారు.
కర్ణాకలోని కలబుర్గి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సిరాజుద్దిన్ అనే వ్యక్తిని రాజస్థాన్ కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), ఎస్ఒజీ అధికారులు సంయుక్తంగా అరెస్టు చేసి విచారిస్తున్నారు. మహమ్మద్ సిరాజుద్దిన్ ను అరెస్టు చేశామని ఏటీఎస్ అదనపు డీజీపీ అలోక్ త్రీపాఠి స్పష్టం చేశారు.
ఇతను ఐవోసీలో మార్కెటింగ్ విభాగంలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఇంటర్నెట్ లో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యాడు. ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా దేశంలోని ముస్లీం యువకులను సంప్రధించాడు.

ఇస్లామిక్ స్టేట్ లో చేరి పవిత్ర యుద్దం చెయ్యాలని ముస్లీం యువకులను రెచ్చగొడుతున్నాడు. ఇతని ఇంటర్నెట్ కార్యకలాపాల మీద ఏటీఎస్ అధికారులకు అనుమానం వచ్చింది. అతని మీద డేగ కన్ను వేశారు. అతని ఫేస్ బుక్, వాట్సప్ అకౌంట్స్ మీద నిఘా వేశారు.
కచ్చితమైన వివరాలు సేకరించి సిరాజుద్దిన్ ను శుక్రవారం వేకువ జామున అరెస్టు చేశామని ఏటీఎస్ అదనపు డీజీపీ అలోక్ త్రిపాఠి వివరించారు. అంతే కాకుండా ఇతను ఐఎస్ఐఎస్ కోసం ఫేస్ బుక్, వాట్సప్ లలో ఫోటోలు పోస్టు చేసేవాడని ఆయన అన్నారు.
అన్ లైన్ లో ఐఎస్ఐఎస్ మ్యాగ్ జీన్ డౌన్ లోడ్ చేసుకున్నాడని, భారత్ తో పాటు విదేశాలలో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించాడని తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అలోక్ త్రిపాఠి వివరించారు. కర్ణాటకలోని కలబుర్గిలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications