బెంగాల్ ఎన్నికల్లో 53.7 సెకన్లకో ఓటు ? ఏపీ తరహా మ్యాజిక్-పరకాల మరో షాకింగ్..!

ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత సంచలనాత్మకంగా మారింది పశ్చిమ బెంగాల్ ఫలితాలే. ఇక్కడ ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ తో పాటు పోలింగ్ రోజు చోటు చేసుకున్న పరిణామాలు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయన్న విశ్లేషణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏపీలో జరిగినట్లుగానే బెంగాల్లోనూ (Bengal) ఎన్నికల పోలింగ్ రోజు అద్భుతాలు చోటు చేసుకున్నాయని, అవే ఫలితాలను బీజేపీ చారిత్రక విజయానికి కారణమయ్యాయని పోల్ అనలిస్ట్ పరకాల ప్రభాకర్ వెల్లడించారు.

బెంగాల్ ఎన్నికల ఫలితాలు (bengal)

బెంగాల్లో ఈసారి ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించి, 2021లో 77 ఉన్న సీట్లను ఈసారి 207కి పెంచుకుంది. మరోవైపు, తృణమూల్ బలం 2021లో ఉన్న 215 నుండి 80కి తగ్గిపోయింది. బీజేపీ ఓట్ల శాతం 2021లో 38.39 శాతం నుండి ఈ ఎన్నికల్లో 46.20 శాతానికి పెరిగి, 7.81 శాతం వృద్ధిని నమోదు చేసింది. తృణమూల్ ఓట్ల శాతం 2021లో 48.55 శాతం నుండి 7.43 శాతం తగ్గి 41.12 శాతానికి పడిపోయింది. అయితే, టీఎంసీ, బీజేపీ మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 5 శాతం మాత్రమే. అంతిమంగా బెంగాల్ ఫలితాలు బీజేపీకి చారిత్రక విజయం అందిస్తే.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత సీట్లోనూ ఓడిపోయేలా చేసాయి.

The Bengal Miracle Has a Dark Side And the Numbers Don t Lie

సునామీ పోలింగ్ పై పరకాల సంచలనం

అయితే ఈ సునామీ లాంటి ఫలితం ఊహించనిది, అవాస్తవమైనదిగా అనిపించిందని పరకాల ప్రభాకర్ తెలిపారు. అయితే, దీనికి రాష్ట్రంలో అవాస్తవమైన, వేగవంతమైన పోలింగ్ వేగం తోడైందన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందన్నారు. ఈసీ నివేదించిన టైం స్లాట్‌లలో ప్రతి నిమిషానికి పోలైన ఓట్లను పరిశీలిస్తే, మొదటి, రెండవ దశలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య అనుమానాస్పదంగా వేగవంతమైన పోలింగ్ రేటు కనిపించింది. తొలిదశలో ఉదయం 7-9 గంటల మధ్య ప్రతీ 47.2 సెకన్లకు ఒక ఓటు పోలైంది. ఉదయం 9 నుండి 11 గంటల మధ్య, ఓటు వేయడానికి ఒక ఓటరుకు 39.7 సెకన్లు పట్టింది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య, పోలింగ్ రేటు ప్రతి 42.2 సెకన్లకు ఒక ఓటు. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య, ప్రతి ఓటుకు 53.50 సెకన్లు పట్టింది. మధ్యాహ్నం 3 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు మాత్రం చూస్తే పోలింగ్ రేటు ప్రతి ఓటుకు 80.0 సెకన్లు, సాయంత్రం 5 నుండి ముగింపు సమయం వరకు, ఓటు వేయడానికి ప్రతి ఓటరుకు 139.5 సెకన్లు పట్టింది.

అత్యల్ప సమయంలో ఓటింగ్

రెండో దశలోనూ గణాంకాలు వాస్తవదూరంగా ఉన్నాయి. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య, ఒక ఓటరు ఓటు వేయడానికి 50.0 సెకన్లు పట్టింది. ఉదయం 9 నుండి 11 గంటల మధ్య, అది 42.5 సెకన్లు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య, ఒక ఓటరుకు 43.4 సెకన్లు పట్టింది. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య, ఒక ఓటరు తీసుకున్న సమయం 52.1 సెకన్లు. మొదటి దశలోలాగే రెండవ దశలో కూడా, మధ్యాహ్నం 3 గంటల నుండి పోలింగ్ ముగింపు సమయం వరకు మాత్రమే పోలింగ్ వేగం నమ్మదగినదిగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య 81.1 సెకన్లు, సాయంత్రం 5 నుండి పోలింగ్ ముగింపు వరకు, ప్రతి ఓటరుకు 272.7 సెకన్లు పట్టింది. ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కోసం అందుబాటులో ఉండే నిమిషాల సంఖ్య 660. అంతరాయాలను బట్టి చూసినా కనీస సమయం 540 నిమిషాలు ఉంటుంది.

ప్రతీ 53.7 సెకన్లకు ఓటు

ఇక్కడ ఎలాంటి అంతరాయాలు లేని తొలిదశలో ఓటరుకు ఓటేసేందుకు సగటున పట్టిన సమయం 52.4 సెకన్లు. రెండవ దశలో ఇది కేవలం 55.2 సెకన్లు మాత్రమే. రెండు దశలను కలిపి చూస్తే, రాష్ట్రంలో మొత్తం పోలింగ్ శాతానికి సుమారుగా 738 ఓట్ల సగటు పోలింగ్‌ను నమోదు చేయడానికి ప్రతి ఓటరుకు అందుబాటులో ఉన్న సగటు సమయం 53.7 సెకన్లు. పోలింగ్ సిబ్బంది తీసుకునే బ్రేకులు, లంచ్, టాయిలెట్ ఇలా వివిధ కారణాల్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సమయం ప్రపంచ రికార్డే. కొన్ని సమయాల్లో ప్రతి ఓటరుకు 39.7 సెకన్ సమయం మాత్రమే పట్టింది.

The Bengal Miracle Has a Dark Side And the Numbers Don t Lie

ఏపీ పోలింగ్ తో బెంగాల్ కు పోలిక

గతంలో ఏపీలో3,500 బూత్‌లలో రాత్రి 8 గంటల నుండి 11.45 గంటల మధ్య 8.38 శాతం పోలింగ్ రేటు, ఆ తర్వాత రాత్రి 11.45 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 2 గంటల మధ్య అదనంగా 4.13 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయం ఫిబ్రవరి 14న వెలుగులోకి వచ్చింది.కానీ బెంగాల్‌లో తమకు కావలసిన పోలింగ్ శాతాన్ని అధికారిక పోలింగ్ గంటల లోపల సాధించడానికి ఈసీఐ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఏపీలో 80.66 శాతం పోలింగ్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు పట్టినప్పటికీ, బెంగాల్‌లో 92.47 శాతం పోలింగ్‌ను రెండు దశలలో సాయంత్రం 6 గంటల కల్లా సాధించారు. ఇంకోలా చెప్పాలంటే ఏపీలో అధికారికంగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినది, బెంగాల్‌లో అధికారిక పోలింగ్ గంటలలోనే సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+