సహజీవనం, మేడమ్ మీద డౌట్, అక్రమ సంబంధం ఉందని ప్రెషర్ కుక్కర్ తో ఇలా !

బెంగళూరు: యువతి, యువకుడు చదువులు పూర్తి చేసుకున్న తరువాత ఐటీ హబ్ చేరుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిది ఒకే రాష్ట్రం కావడంతో వారికి పరిచయం అయ్యింది. ప్రేమించుకున్న యువతి యువకుడు పెళ్లి చేసుకోకుండానే ఒకే అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలికి అక్రమ సంబంధం ఉందనే డౌట్ తో ప్రియుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఆమె తల మీద చితకబాదేశాడు.

ప్రెషర్ కుక్కర్‌తో సహజీవనం చేస్తున్న ప్రియురాలి తలను పగులగొట్టి హత్య చేసిన యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు సోమవారం తెలిపారు. బెంగళూరు సిటీలోని

మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

The boyfriend killed his live-in partner girlfriend by hitting her with a pressure cooker in Bengaluru.

నిందితుడు కేరళకు చెందిన వైష్ణవ్ (24) అని పోలీసులు అన్నారు. సహజీవనం చేస్తున్న దేవి (24)ని వైష్ణవ్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు.

కొంతకాలం క్రితం నుంచి నిందితుడు వైష్ణవ్ కు అతని ప్రియురాలు దేవి మీద అనుమానాలు ఉన్నాయి. సహజీవనం చేస్తున్న ప్రియురాలు దేవి వేరే వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని ఆమె ప్రియుడు వైష్ణవ్ కు విపరీతమైన అనుమానం ఉంది. ఇదే విషయంలో వైష్ణవ్, దేవిల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి కూడా అదే విషయంలో వైష్ణవ్, దేవిల మధ్య గొడవ జరిగింది. వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంతో ఊగిపోయిన ప్రియుడు వైష్ణవ్ అతని ప్రియురాలు దేవి తల మీద ప్రెషర్ కుక్కర్‌తో కొట్టాడు. తీవ్రగాయాలైన దేవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హత్యకేసు నమోదు చేశామని, ఇప్పటికే హంతకుడు వైష్ణవ్ ను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని బెంగళూరు సిటీ సౌత్-ఈస్ట్ డివిజన్ డీసీపీ సీకే బాబా సోమవారం మీడియాకు చెప్పారు.

వైఫ్ణవ్, దేవి ఇద్దరూ గత మూడేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని, దక్షిణ బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రాథమిక సమాచారం ప్రకారం, వైష్ణవ్ అతని ప్రియురాలు, దేవికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. శనివారం సాయంత్రం నుంచి ఇద్దరి మద్య ఇదే విషయంపై వాగ్వాదం జరుగుతోందని తెలిసింది.

The boyfriend killed his live-in partner girlfriend by hitting her with a pressure cooker in Bengaluru.

ఆ సందర్బంలో ఆవేశంతో వైష్ణవ్ ప్రెషర్ కుక్కర్‌తో ప్రియురాలు దేవిపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బెంగళూరులోని ఓ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న వైష్ణవ్ హత్య చేసి పారిపోయాడు. అయితే పోలీసులకు అతను పట్టుబడ్డాడు. దేవి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు.

ది హిందూ పత్రిక నివేదిక ప్రకారం వైష్ణవ్, దేవిల మధ్య కొంతకాలంగా నిరంతరం గొడవలు జరుగుతున్నాయని వారి కుటుంబ సభ్యులకు తెలుసని, అనేక సందర్భాల్లో ఇద్దరిని శాంతింపజేయడానికి వారు కూడా ప్రయత్నించారని తెలిసింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం త్వరలో వైష్ణవ్, దేవి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారని, అయితే అంతలోనే ఇలా జరిగిపోయిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+