ఎదురు కట్నం తీసుకున్న పెళ్లికూతురు, శోభనం జరిగింది, బంగారు నగలతో మేడమ్ జంప్ !
భారతీయల వివాహాలలో సాధారణంగా పెళ్లికొడుకు కట్నం తీసుకుంటాడు. పెళ్లి అయినప్పుడు అమ్మాయిల కుటుంబాలు అబ్బాయిలకు నగదు, వివిధ వస్తువులు, బైక్‌లు, కార్లు మొదలైన విలువైన వస్తువులు కట్నంగా ఇస్తారు. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు అంటే వరుడి తరపు వారు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎదురుకట్నం చెల్లిస్తారు.
అమ్మాయి తల్లిదండ్రులకు నగదు చెల్లించిన తరువాత వారి కుమార్తెల వివాహం అన్ని రకాల సంప్రదాయాల ప్రకారం జరిపిస్తుంటారు. ఇక్కడ కూడా ఓ యువకుడు ఎదురుకట్నం ఇచ్చి వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడ కథ రసవత్తరంగా మారింది. ఒకవైపు పెళ్లి తర్వాత అమ్మాయిలు చాలా సందర్భాల్లో మోసపోతుంటే కొన్ని చోట్ల అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. ఇటీవల రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక వ్యక్తి ఎదురుకట్నం ఇచ్చి వివాహం చేసుకుని మోసపోయాడు.

ఆ అబ్బాయికి ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. 20 రోజుల క్రితం ఈ పెళ్లి సెట్ అయ్యింది. వివాహం జరిగిన మరుసటి రోజే పెళ్లికూతురు జంప్ అయ్యింది. పెళ్లికి ముందే అమ్మాయి కుటుంబానికి ఆ పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు రూ. లక్ష నగదు ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరిపించాలని డేట్ ఫిక్స్ చేశారు. భరత్‌పూర్‌కు చెందిన రాజన్ సింగ్, సుల్తాన్‌పూర్‌కు చెందిన పూజను ఫిబ్రవరి 17వ తేదీన వివాహం చేసుకున్నాడు.
పెళ్లి సందర్భంగా పెళ్లి కుమారుడు రాజన్ సింగ్ కుటుంబ సభ్యులు వధువు పూజా కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారు. ఫిబ్రవరి 19వ తేదీన పెళ్లి కుమార్తె పూజాకు పసుపు కుంకుమలతో పాటు తిలకం, బంగారు నెక్లెస్, పసుపుదారం, మూడు బంగారు ఉంగరాలు, టాప్స్, బంగారు కంకణాలు, మంగళసూత్రం సహా రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు అందజేశారు. పెళ్లి కుమార్తె పూజా ఆమెకు ఇచ్చిన బంగారు నగలను తన వద్దే ఉంచుకుంది.

తరువాత పూజా రాజన్ సింగ్ ను పెళ్లి చేసుకుని అతని ఇంటికి వచ్చింది. అయితే ఆ రాత్రి అందరూ తింటున్న ఆహారంలో పాలలో మత్తు మందు కలిపి అందరికి పెట్టింది. అందరూ మత్తు మందు కలిపిన ఆహారం తిన్న తరువాత, కొందరు పాలు తాగిన తరువాత మత్తులోకి జారుకున్నారు. తరువాత కొత్త పెళ్లికూతురు పూజా పెళ్లి కొడుకు రాజన్ సింగ్ కుటుంబ సభ్యులు పెట్టిన బంగారు నగలతో చిన్నగా ఇంటి నుంచి బయటకు వెళ్లి పారిపోయింది.
మరుసటి రోజు అందరూ నిద్రలేచి షాక్ అయ్యారు. తనకు జరిగిన మోసం గురించి రాజన్ సింగ్ బోరున ఏడవడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి జీవించాల్సిన పూజా మోసం చేసిందంటే నమ్మలేకపోతున్నానని, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదని రాజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ దెబ్బతో రాజన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంగారు నగలతో మాయం అయిన పూజా సింగ్ మీద కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications