వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడుకు షాక్: రోజుకు 3 వేల క్యుసెక్కుల నీరు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడుకు ఈనెల 21 నుంచి 30వ తేది వరకు (10 రోజులు) మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కావేరీ జలాల పంపిణి కమిటి (కావేరీ సూపర్ వైజరీ కమిటి ) కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాధవ్ అంగీకరించకుండా విరోధం వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కావేరీ జలాల పంపిణి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం మొదలైయ్యింది.

The Cauvery Supervisory Committee meeting.

కావేరీ నీరు మాకు విడుదల చెయ్యాలని తమిళనాడు డిమాండ్ చేసింది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కావేరీ జలాల పంపిణి విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

తరువాత ఈనెల 21వ తేది నుంచి 30వ తేది వరకు తమిళనాడుకు ప్రతి రోజు మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని కేంద్ర జనవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రతి రోజు 12 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు.

అయితే మంగళవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు వేచిచూడాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు భావించాయి. ముందు జాగ్రత చర్యగా బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, మండ్య, మైసూరు జిల్లాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
All eyes would be on the meeting of the Cauvery Supervisory Committee meeting. The meeting that gets underway at 11.30 AM will hear both parties and the decide on the quantum of water that needs to be released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X