వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృత్యుఒడి నుండి బయటపడ్డ ఉన్నావో బాధితురాలు, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్న సీబీఐ

|
Google Oneindia TeluguNews

మృత్యు ఒడికి చేరుకున్న ఉన్నావో అత్యచార బాధితురాలు ఎట్టకేలకు సాధరణ స్థితికి చేరుకోవడంతో ప్రమాదానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేసుకుంది. జూలై 28న ఆమే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఇద్దరు బంధువులు మృత్యువాత పడగా ,ఆమే ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం సుప్రిం కోర్టు ఆదేశాలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి షిప్ట్ చేసి గత నెల రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడి రోజుల క్రితమే సాధరణ స్థితికి చేరడంతో అత్యవసర వార్దు నుండి జనరల్ వార్డుకు తరలించారు.

ఉన్నావో భాదితురాలు ఎట్టకేలకు ప్రమాదం భారి నుండి తప్పించుకుంది. ఎయిమ్స్‌లో చికిత్స పోందుతున్న ఆమేను సాధరణ విభాగానికి తరలించారు. దీంతో ఆమే ప్రమాద భారి నుండి పూర్తిగా కొలుకుంటున్నట్టేనని వైద్యులు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే కేసుకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు సిబిఐ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆమే స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

 The CBI has recorded the statement of the Unnao rape victim in the case of the road accident

ఉన్నావో భాదితురాలిపై హత్యప్రయత్నం జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. దీంతో రాజకీయ విమర్శలు చెలరేగాయి. ఈనేపథ్యంలోనే సుప్రిం కోర్టు సీరియస్ కావడంతో కేసును సుమోటా తీసుకుంది. దీంతో అత్యాచారం నుండి ప్రమాదం వరకు జరిగిన పరిణామాలపైపాటు మొత్తం ఆమే పెట్టిన కేసులను సిబిఐ విచారించాలని ఆదేశాలు జారి చేసింది. మరోవైపు ఆమే కేసులను యూపి నుండి డిల్లీకి బదాలాయించింది. ఇక కేసులపై రోజువారి విచారణ జరపాలని ఆదేశించింది. అయితే ఆమే ప్రాణాపాయ స్థితిలో కి వెళ్లడంతో బాధితురాలని స్టేట్‌మెంట్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈనేపథ్యంలోనే కేసు పురోగతికి ఫుల్‌స్టాప్ పడింది.

English summary
The CBI has recorded the statement of the Unnao rape victim in the case of the road accident,in which she lost her aunts and she and her lawyer were injured
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X