ఇక వందేభారత్ లోనూ వర్తింపు - కేంద్రం కీలక నిర్ణయం..!!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం నియామకం పైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే 8వ పీఆర్సీ ఛైర్మన్ ను నియమించ నుంది. ఇక.. వందేభారత్ కు పెరుగుతున్న ఆదరణ వేళ మరో నిర్ణయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద తేజస్, వందే భారత్ లో ప్రయాణానికి కేంద్రం అనుమతి ఇస్తూ నిర్ణయం వెల్లడించింది.
కేంద్రం కొత్త ఏడాది ప్రారంభంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాల అమలు దిశ గా అడుగులు వేస్తోంది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కు ఆమోదం తెలిపింది. త్వరలోనే నూతన వేతన సంఘం ఛైర్మన్ ను నియమించనుంది. కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం ఎంతో కాలంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) అమలు చేస్తోంది. ఎల్టీసీ వినియోగంలో కేంద్ర నిబంధనలను సడలించింది. ఇక నుంచి ఎల్టీసీ కింద తేజస్, వందే భారత్, హమ్సఫర్ రైళ్లలో ప్రయాణించడానికి కేంద్రం అనుమతించింది.

వివిధ ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిన అనేక సూచనలను పరిశీలించిన అనంతరం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)- ప్రీమియం రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగుల కు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై ఎల్టీసీ కింద తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ వారు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.
అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్మెంట్ కూడా పొందుతారు. ఈ విషయాన్ని వ్యయ శాఖ తో సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రాంతాలకు వందేభారత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు సైతం పట్టాలెక్కనున్నాయి. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications