కాబోయే భార్య కోరిక.. హెలికాప్టర్ లో దిగిన వరుడు! అవాక్కయిన ఊరి జనం..
జీవిత భాగస్వామి గురించి కలలు కనడం యువతీయువకులకు పరిపాటి. అలాగే ఓ యువతి కూడా ఎప్పుడూ ఓ కల కనేది. అయితే ఆమె కలను నిజం చేసేశాడు ఆమె జీవిత భాగస్వామి.
లక్నో: జీవిత భాగస్వామి గురించి కలలు కనడం యువతీయువకులకు పరిపాటి. అలాగే ఓ యువతి కూడా ఎప్పుడూ ఓ కల కనేది. అయితే ఆమె కలను నిజం చేసేశాడు ఆమె జీవిత భాగస్వామి.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన షారూఖ్ అనే కుర్రాడికి ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరు జిల్లా, కొత్వాలి పట్టణానికి చెందిన తాన్జిమ్ తో వివాహం నిశ్చయమైంది. తాన్జిమ్‌ది పేద కుటుంబం.
Bridegroom from Jaipur arrived for the wedding in a helicopter in #UttarPradesh's Hapur, says he always wanted his wedding to be different. pic.twitter.com/HyH76eyS3b
— ANI UP (@ANINewsUP) November 15, 2017
పెళ్లి నిశ్చయమయ్యాక ఓ రోజున మాటల మధ్యలో తనకో కోరిక ఉందని, తనకు కాబోయే భర్త హెలికాప్టర్ లో వచ్చి తనను తీసుకెళ్లాలని తాను కలలుకనే దానినని షారూఖ్ కి చెప్పిందామె.
అంతే, ఆమె కోరికను నిజం చేయాలనుకున్నాడు షారూఖ్. పెళ్లి రోజున నిజంగానే హెలికాప్టర్ లో అత్తగారింటి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పై దిగాడు. ఇక తాన్జిమ్ ఆనందానికైతే పట్టపగ్గాల్లేవు. ఈ విషయం తెలిసి ఊరి జనమంతా ముక్కున వేలేసుకున్నారు.
ఆ తరువాత షారూఖ్, తాన్జిమ్ ల వివాహం ధూంధాంగా జరిగిపోయింది. వివాహానంతరం అదే హెలికాప్టర్ లో ఆమెను మెట్టినింటికి తీసుకెళ్లాడు షారూఖ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, పెళ్లికుమారుడు ఇలా ప్రత్యేకంగా హెలికాప్టర్ లో రావడమనేది ఇదే మొదటిసారేం కాదు. గతంలో జమ్మూలోని గంగ్యాల్ కు చెందిన ఓ గ్రాసరీ స్టోర్ ఓనర్ కుమారుడు అనిల్ కుమార్ కూడా తనకు కాబోయే భార్యను ఆశ్చర్యపరిచేందుకు హెలికాప్టర్ లో పెళ్లిమంటపం వద్ద దిగాడు.












Click it and Unblock the Notifications