బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ కర్మకాండ: నేడు ప్రభుత్వానికి నివేదిక ! ఏం ఇస్తారు ?

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక .

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలిసింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి రూ. 2 కోట్లు లంచం తీసుకుని ఆమెకు వీవీఐపీ సౌకర్యాలు కల్పించారని అప్పటి జైళ్ల శాఖ డీఐజీ రూప ఆరోపణలు చేశారు.

 The committe will be headed by retired IAS officer Vinay Kumar

తనపై అధికారి (డీజీపీ) సత్యనారాయణరావ్ మీద ఫిర్యాదు చేస్తూ ఏకంగా కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే డీఐజీ రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలి చేశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలపై విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా ఓ కమిటి (సిట్)ను ఏర్పాటు చేస్తూ సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.

అప్పటి నుంచి సిట్ చీఫ్, మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణ జరుపుతోంది. వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణ జరిపి ఒక్క వారంలో నివేదిక సమర్పించాలని సిద్దరామయ్య సూచించారు.

సోమవారం నాటితో ఒక్క వారం గడుపు పూర్తి కావడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని, తుది నివేదిక నెలలోపు ప్రభుత్వానికి ఇస్తారని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా ? డీఐజీ రూపకు అనుకూలంగా ఉంటుందా ? అనే విషయం త్వరలోనే వెలుగు చూడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+