కర్ణాటక సీఎం పేరు ప్రకటించనున్న హైకమాండ్, ఈరోజు ఫైనల్స్ అంటున్న లీడర్స్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపినా పరిస్థితి మాత్రం ఓ కొలిక్కిరాలేదు. బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చి చర్చలు జరిపిన తరువాత కర్ణాటక సీఎం పేరు ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

మంగళవారం ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ మొదట కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాతో ప్రత్యేకంగా సమామావేశం అయ్యారు. ఈసారి తననే ముఖ్యమంత్రి చెయ్యాలని, కేపీసీసీ అధ్యక్షుడిగా తనను సీఎం చెయ్యడం కాంగ్రెస్ సాంప్రధాయం అని డీకే శివకుమార్ ఇద్దరు నాయకులకు చెప్పారని తెలిసింది.

The Congress High Command will be announced by the CM after discussing with Sonia Gandhi and Rahul

సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం అయిన డీకే శివకుమార్ తనకు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఇవ్వాలని, కర్ణాటకకు చెందిన మీకు ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసని, తాను ఎంత కష్టపడ్డానో మీరే చేశారు కదా, తనకు సీఎంగా అవకాశం ఇస్తే ఇంకా కష్టపడి పని చేస్తానని డీకే శివకుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి మనవి చేశారు.

మల్లికార్జున ఖార్గేతో చర్చలు జరిపిన తరువాత డీకే. శివకుమార్ అక్కడి నుంచి వెళ్లిన గంట తరువాత మాజీ సీఎం సిద్దరామయ్య మల్లికార్జున ఖార్గే ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక ముందు తాను పోటీ చెయ్యనని ఇప్పటికే ప్రకటించానని, ఇదే తన చివరి ఎన్నికలు అని, తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకి సిద్దరామయ్య మనవి చేశారు.

The Congress High Command will be announced by the CM after discussing with Sonia Gandhi and Rahul

సీఎం పదవి తనకే కావాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ పట్టుబట్టడంతో కర్ణాటకకు చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలీక సతమతం అవుతున్నారని తెలిసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ వాదనలు విన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే బుధవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఇంత వరకు జరిగిన చర్చల గురించి వివరించనున్నారని తెలిసింది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీర్ సింగ్ సూర్జేవాల తదితరులు చర్చలు జరిపిన తరువాత కర్ణాటక సీఎం ఎవరు అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. సిద్దరామయ్య, డీకే శివకుమార్ రాజీకి వస్తే వాళ్లకే మంచిదని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అంటున్నారు.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన డాక్టర్ జీ. పరమేశ్వర్ ను సీఎం చెయ్యాలనే ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ఉందని తెలిసింది. మొత్తం మీద బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గంలోని నాయకులు టెన్షన్ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+