శాంతి అనే పదానికి శత్రువు కాంగ్రెస్, సర్వనాశనం చేస్తారని మండిపడిన ప్రధాని మోదీ !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళూరులో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతున్నారు. శాంతి అనే పదానికి శత్రువు కాంగ్రెస్ పార్టీ, ఉగ్రవాదులకు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు ఓటు వేస్తే కర్ణాటక సర్వనాశనం అవుతుందని, ఈ విషయంలో కర్ణాటక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. భారతదేశం భద్రత కోసం ప్రాణాలు అర్పిస్తున్న భారత సైనికుల గురించి చులకనగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 85 శాతం కమీషన్ ఉండేదని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో 85 శాతం మింగేసిన కాంగ్రెస్ నాయకులు కేవలం 15 శాతం మాత్రమే ప్రజలకు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ కర్ణాటకలో రివర్స్ గేర్ ప్రభుత్వం వస్తుందని, అందుకే ఆ పార్టీని, ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న జేడీఎస్ పార్టీలను దూరం పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు మనవి చేశారు. దేశంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మకూడదని, ఆ పార్టీలోని కొందరు నాయకులు దేశానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

హిందుస్తాన్ లో జై కర్ణాటక అనే నినాదం జోరుగా వినిపించాంటే బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, సంపూర్ణ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసి చేసిచూపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో మా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అని మేము వివరిస్తున్నాము, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోని ప్రజలకు ఏం చేసిందో వివరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలెంజ్ చేశారు.












Click it and Unblock the Notifications