Congress: కెనడా వ్యవహారంలో భారత ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్..

భారత్,కెనడా మధ్య దౌత్యపరేగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెట్లు ఉన్నారని కెనడా ఆరోపించింది. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసి తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీనిపై భారత్ కూడా గట్టిగానే బదులిస్తోంది. భారత్‌కు కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖకు సమన్లు జారీ చేసింది. కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించిన నేపథ్యంలో భారత్ లోని కెనడా హైకమిషనర్ ని కూడా బహిష్కరించి ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

కెనడా భారత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఈ విషయమై జైరాం రమేష్ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ రాజీ పడదని జైరాం రామేష్ ఎక్స్(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. భారత్ తీవ్రవాదిగా ముద్ర వేసిన ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా వైఖరిపై సరైంది కాదన్నారు. అయితే భారత్, కెనడా మధ్య ఎప్పటి నుంచో పోసగడం లేదు. జీ20 సదస్సు హాజరైన ట్రూడో కూడా అంటిముంట్లనట్టుగానే ఉన్నారు.

There are diplomatic tensions between India and Canada. Canada has accused Indian agents of being behind the killing of Khalistan Tiger Force leader Hardeep Singh Nijjar. Expulsion was imposed on the Indian ambassador and severe measures were taken.

జూన్‌ 18 హత్య హర్ దీప్ సింగ్ సజ్జర్ హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించాడు. దీంతో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు తలెత్తాయి. ట్రూడో ఇలా వ్యవహరించడానికి రాజకీయ బలహీనత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని.. మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.

2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వ రాజకీయ బలహీనత ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. అయితే కెనడా ఏదో అనామక దేశమైతే భారత్‌కు పెద్ద ఇబ్బందికాదు.. కానీ, అది ప్రపంచంలోని సంపన్న దేశాల కూటమి అయిన జీ7 సభ్యదేశంగా ఉంది. నాటోలో కూడా కెనడాకు సభ్యత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, కెనడా మధ్య ఉద్రక్తతలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+