Amruta Fadnavis: అమృతా ఫడ్నవీస్‍తో క్రికెట్ బుకీ ఏం చాటింగ్ చేశాడంటే..!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ను డబ్బులు డిమాండ్ చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. క్రికెట్ బుకీ అనిల్ జైసింఘాని "మార్చి 1, 2022న మీరు శివసేన ప్రభుత్వాన్ని పతనం చేయాలని, ఏక్‌నాథ్ షిండే, అనిల్ పరాబ్‌లను ఎలా ట్రాప్ చేయాలి అని చెప్పారు. అది కూడా నా దగ్గర అన్ని రికార్డింగ్‌లు ఉన్నాయి" అంటూ అమృతా ఫడ్నవీస్ ను డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో తెలిపారు.
అమృతా ఫడ్నవీస్ ను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అనిల్ జైసింఘాని, అతని కుమార్తె అనిక్షను మార్చిలో అరెస్ట్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అనిల్ జైసింఘాని చేసిన చాటింగ్ లను జత చేశారు. "నేను పంపినది పూర్తిగా నిజం. వాస్తవమైనది. అది అబద్ధమా అని మీరు నాకు చెప్పండి. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అని మీరు తప్పక విన్నారని నేను ఆశిస్తున్నాను" అంటూ అనిల్ జైసింఘాని అమృతా ఫడ్నవిస్ తో చాట్ చేశారు.

తాను నార్కో పరీక్షలకైనా సిద్ధమే. మరి మీరు సిద్ధమైనా అని అనిల్ జైసింఘానీ అమృత్‌కు సందేశం పంపినట్లు పోలీసులు చెప్పారు.బుకీపై ఉన్న పలు కేసులను ఉపసంహరించుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సహాయం తీసుకోవడానికి జైసింఘాని, అతని కుమార్తె అనిక్ష రూ. 1 కోటి లంచం ఇవ్వాలని ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అమృతా ఫడ్నవీస్ ను బ్లాక్ మెయిల్ చేసి
రూ.10 కోట్లు దోపిడీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
జూన్ 2022లో షిండే రూపొందించిన తిరుగుబాటు తర్వాత శివసేన ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. అమృతా ఫడ్నవీస్ కు తానొక డిజైనర్ అని అనిక్ష పరిచయం చేసుకుంది. తర్వాత తన తండ్రి గురించి ఆమె చెప్పడంతో అనిక్షను అమృతా దూరం పెట్టారు. దీంతో అనిల్ జైసింఘాని, అనిక్ష అమృతా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications