భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక దేశాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా ?
భారతదేశం మ్యాప్‌ను మనం ఎప్పుడూ చూసే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి ఇండియా మ్యాప్‌లో మన సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటివి స్పష్టంగా కనిపించనప్పటికీ, మనకు దగ్గరగా ఉన్న శ్రీలంక దేశం మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఒక ఆసక్తికరమైన చట్టం ఉంది.
యునైటెడ్ నేషన్స్ చట్టమే కారణం
1958లో ఐక్యరాజ్యసమితి (UN) రూపొందించిన 'లా ఆఫ్ ది సీ' (Law of the Sea) అనే అంతర్జాతీయ చట్టం దీనికి ప్రధాన కారణం. ఈ చట్టం ప్రకారం, ఒక దేశం యొక్క సముద్ర సరిహద్దుకు 200 నాటికల్ మైళ్ల (సుమారు 370 కిలోమీటర్లు) లోపు ఉన్న ఏ ఇతర దేశాన్నైనా దాని మ్యాప్‌లో తప్పనిసరిగా చూపించాలి.

భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న దూరం కేవలం 18 నాటికల్ మైళ్ళు, అంటే సుమారు 54.8 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 200 నాటికల్ మైళ్ళ పరిధిలో ఉంది. అందుకే, భారతదేశం తన మ్యాప్‌లో శ్రీలంకను చూపించడం తప్పనిసరి.
ఈ నిబంధన వల్లనే ప్రపంచంలో మరే దేశం తన మ్యాప్‌లో పక్క దేశాన్ని చూపించనప్పటికీ, భారతదేశం మాత్రం శ్రీలంకను చూపిస్తోంది. మనకు తెలియని ఈ చిన్న విషయం వెనుక ఇంత పెద్ద అంతర్జాతీయ చట్టం ఉందని తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.












Click it and Unblock the Notifications