ఎయిమ్స్ ఆసుపత్రి ముందు అవస్థలు, రైలు ప్రమాదంలో చనిపోయింది ఎవరు ?, మావాళ్లు !
భువనేశ్వర్/ఒడిశా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలు స్వాధీనం చేసుకోవడానికి బాధితుల బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హెల్ప్ లైన్లు ఏర్పాటు చెయ్యడంతో ఆ హెల్త్ లైన్ల దగ్గర బాధితుల కుటుంబ సభ్యులు వారి ఆనవాళ్లు కనుగొనడానికి, చనిపోయిన వారు మావాళ్లా ?, కాదా ? అని తెలుసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది.
భువనేశ్వరలోని ఎయిస్స్ ఆసుపత్రి ముందు అధికారులు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయారని కేంద్ర రైల్వే శాఖా మంత్రి ప్రకటించారు. అయితే బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం అంటోంది. రైలు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో తేడా ఉంది.

బాలాసోర్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, బీహార్ కు చెందిన వారే ఉన్నారని, బతుకుదెరువు కోసం వీళ్లు దక్షిణ భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లోని నగరాల్లో నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి ముందు బాధితుల కుటుంబ సభ్యులు చాలాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది.
పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ కు చెందిన మున్సీ (32) అనే యువకుడు చెన్నైలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. మున్సీ కూడా ప్రమాదం జరిగిన రైలులోనే ప్రయాణించాడు. దసరాకు వస్తానని మున్షీ అతని భార్యకు హామీ కూడా ఇచ్చాడు. రైలు ప్రమాదం జరిగిందని టీవీల్లో న్యూస్ తెలిసిన వెంటనే ముర్షిదాబాద్ లో ఉన్న సోదరుడు సాగర్ రైలులో వెళ్లిన మున్షీకి ఫోన్ చేశాడు.

అయితే మున్షీకి బదులుగా గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ రిసీవ్ చేసి మేము సోరో ఆసుపత్రిలో ఉన్నామని, మీ సోదరుడు మున్షీ సోదరుడి జోబులో నుంచి నేను మొబైల్ తీశానని, మీరే వెంటనే ఇక్కడికి రావాలని సాగర్ కు చెప్పాడు. భువనేశ్వర్ కు చేరుకున్న సాగర్ అతని సోదరుడు మున్షీ శవం కోసం గాలిస్తూనే ఉన్నాడు. అయితే తన సోదరుడిని తాను గుర్తించలేకపోతున్నానని సాగర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఎయిమ్స్ ఆసుపత్రిలో చనిపోయిన వారి శవాలను గుర్తిస్తున్నారు. చనిపోయిన వారి గుర్తింపు కార్డులు పరిశీలించి శవాలు మారిపోకుండా అన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని అధికారులు అంటున్నారు. పలు ఆసుపత్రుల్లోని మార్చురీల్లో శవాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.












Click it and Unblock the Notifications