అబార్షన్ విషయంలో సంచలన తీర్పు ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు...
బిడ్డను కనాలా? వద్దా? అనే విషయంలో... గర్భం దాల్చిన మహిళదే తుది నిర్ణయమని ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. బిడ్డను పోషించే స్తోమత లేకపోతే ఆ తల్లి అబార్షన్ చేసుకుని అవకాశం ఉందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పడు ఓ మహిళ తన 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు పిటిషన్ వేసింది. అందుకు అంగీకరించింది ఢిల్లీ హైకోర్టు. జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఈ పిటిషన్‌ను విచారించడం జరిగింది.
శారీరకంగా హింసించేవాడు : ఢిల్లీకి చెందిన సదరు మహిళ భర్తతో కలిసి ఉన్నప్పుడు గర్భం దాల్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు. అయితే ప్రసుత్తం తనకు బిడ్డను కనడం ఇష్టం లేదని, అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుని ఆశ్రయించింది సదరు మహిళ. అయితే, ఈ సమయంలో మహిళతో పాటు ఆమె భర్త కూడా కోర్టుకి వచ్చాడు. భర్తతో కలిసి ఉండడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, ఆ మహిళ కోర్టు ముందు విన్నవించుకుంది. భర్త మాత్రం ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. అందుకు భార్య ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఏడాది మే లో వీరిద్దరికి పెళ్లైంది. జూన్‌లో ఆ మహిళ గర్భం దాల్చింది. ఇన్ని రోజుల్లో తనను భర్త శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడని సదరు మహిళ కోర్టుకు ఫిర్యాదు చేసింది. గర్భవతినని చూడకుండా కొట్టాడని ఆ కోర్టులో అందరిముందు చెప్పింది. ఇలాంటి మనిషితో కలిసి ఉండలేనని ఖరాకండీగా చెప్పేసింది.

కోర్టు అనుమతిచ్చింది : అబార్షన్‌కి కోర్టు అనుమతినివ్వక ముందు ఎయిమ్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో అబార్షన్ చేయొచ్చా లేదా అని చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ మెడికల్ బోర్డ్‌ని నియమించాలని చెప్పింది. అయితే, ఎయిమ్స్ కోర్టుకి కొన్ని కీలక వివరాలు వెల్లడించారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణనష్టము ఉండదని తేల్చిచెప్పారు. సదరు మహిళ తరపున న్యాయవాది ఈ విషయంలో కోర్టులో గట్టిగానే పోరాడారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ లోని ప్రొవిజన్స్ ప్రకారం, ఈ సమయంలో అబార్షన్ చేయడం సురక్షితమే అని కోర్టుకి వివరించారు. ఈ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ హైకోర్టు సదరు మహిళా 23 వారాల గర్బాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది.












Click it and Unblock the Notifications