Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్క రాష్ట్రంలో మీ హంగామా ఏమిటి ?, ఈసీ వార్నింగ్, తెలంగాణలో ఓవర్ యాక్షన్ ?

కర్ణాటక ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలోని సిద్దరామయ్య అత్యుత్సాహం చూపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం తెలుగు మీడియాలో ప్రముఖ దినపత్రికల్లో ప్రటనలు ఇవ్వకూడదని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకండా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్ వార్నింగ్ ఇచ్చిందని కన్నడ మీడియా అంటోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉచిత హామీలు ఇచ్చిందో అలాగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు ఉచిత హామీలను ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణలోని తెలుగు దినపత్రికలో కర్ణాటక ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇచ్చింది. తెలంగాణలో సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికల్లో సిద్దరామయ్య ప్రభుత్వం భారీ ప్రకటనలు ఇచ్చింది.

The EC warned the government in Karnataka for issuing advertisements in Telugu newspapers in Telangana
ఢిల్లీ పెద్దలకు మామూళ్లు, లేదంటే తేడాలు, సీఎం, మంత్రుల టార్గెట్ ఫిక్స్, ఫైల్ కదలాలంటే ?

తెలంగాణలో కర్ణాటక సొమ్ము వృథా అవుతోందని, కన్నడిగుల సొమ్మును తెలంగాణ పారబోస్తన్నారని, కాంగ్రెస్‌ ఎత్తుగడలను అడ్డుకోవాలని బీజేపీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఎన్నికల కోసం కర్ణాటక రాష్ట్ర మంత్రుల, సీఎం సీఎం సిద్ధరామయ్య కలిసి అక్కడి ప్రజలు పన్నుల కడుతున్న సొమ్ముతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు కర్ణాటక ఆర్థికంగా దివాళా తీసిందని బీజేపీ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం మీద తెలంగాణలోని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తెలంగాణ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వవద్దని ఎన్నికల సంఘం కర్ణాటక కాంగ్రెస్‌ను ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుతం సోమవారం రోజంతా కర్ణాటక ప్రభుత్వ ప్రకటన గురించే. కర్ణాటకలో హామీ పథకాలను అమలు చేశామని ప్రచారం చేశారు.

ఆరు నెలల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పి తెలంగాణ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసుకుందని బీజేపీ, బీఆర్ ఎస్ ఆరోపించాయి. ఇది కాకుండా కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీని ఆకర్షించడానికి తెలంగాణలో ప్రచారం కోసం అర్హులైన అభ్యర్థులను నియమించింది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ విజయం సాధించాలని ప్లాన్ చేసింది.

The EC warned the government in Karnataka for issuing advertisements in Telugu newspapers in Telangana

కర్ణాటకకు చెందిన మంత్రులు బి.నాగేంద్ర, బీజెడ్ జమీర్ అహ్మద్, రామలింగా రెడ్డి, డి.సుధాకర్, ఎన్ ఎస్ బోస్ రాజుతో పాటు పలువురు తెలంగాణ ఓటర్లను ఆకర్షించడానికి తెలుగులో మాట్లాడుతూ ఇన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సహా ముఖ్యమైన నేతలు తెలంగాణలోని వివిధ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+