కర్ణాటక ఎన్నికల నగారా - నేడు షెడ్యూల్ ప్రకటన..!!

మరో ఎన్నికల సమరానికి షెడ్యూల్ విడుదల కానుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్దం అయింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తిరిగి అధికారం నిలబెట్టుకోవటం బీజేపీకి కీలకంగా మారింది. అదే సమయంలో ఈ సారి విజయం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తమతో కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా పొత్తు కోసం టచ్ లోకి వచ్చిందని జేడీఎస్ నేత కుమార స్వామి చెబుతున్నారు. ఇక, కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్ధన రెడ్డి ప్రభావం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ పోటీ పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తోంది. ఇప్పటికే 124 మంది ఎమ్మెల్యేల జాబితాను ప్రకటించింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. వరుణ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు టికెట్ ఇచ్చారు. ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24తో ముగియనుంది. అప్పటికి 224 స్థానాలున్న అసెంబ్లీని ఎన్నుకోవాలంటే ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేయటం..దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఏకం కావటం కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాహుల్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర సమయంలోనూ అనూహ్య స్పందన కనిపించింది.

The Election Commission to announce Assembly Election schudule today, term ends in May

ఇటు కొంత కాలంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేసారు. తాజాగా బెంగళూరు మెట్రో ఫేజ్ 2 కొత్త విభాగాన్ని ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు మెట్రో ఫేజ్ 2 కింద రీచ్ -1 విస్తరణ ప్రాజెక్టు వైట్ ఫీల్డ్ మెట్రో నుంచి కృష్ణరాజ్ పుర మెట్రో లైన్ వరకు 13.71 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ఆవిష్కరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక వ్యవహారాలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. జేడీఎస్‌లో 2018 నాటి ఎన్నికల సమయంలో ఉన్నంత వేడి కనిపించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన అనేది కుమారస్వామికి పెద్ద సవాలుగా మారుతోంది. కీలక నియోజకవర్గాల నుంచి ఒకరికంటే ఎక్కువ మంది ఉద్ధండులు ఆశావహ జాబితాలో ఉన్నారు.

ఇక, బీఆర్ఎస్ పాత్ర పైన క్లారిటీ రావాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇస్తామని గతంలోనే బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర పైనే ఎక్కువగా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో బీఆర్ఎస్ స్పందన చూడాల్సి ఉంది. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ అనర్హత వ్యవహారంలో ఒక్కటైన ప్రతిపక్షాలు కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ తోనూ జత కడతారా..లేక, ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసకత్ి కరంగా మారుతోంది. 2024 ఫైనల్ ఎన్నకల వేళ కర్ణాటక సమరం ఉత్కంఠను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+