చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ చిన్నమ్మ: ఉచ్చు బిగిద్దామనుకుంటే.. శశికళ ముందు బీజేపీ, పన్నీరు చిత్తు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పావులకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిత్తయ్యారా? చిన్నమ్మ తిప్పిన చక్రం ముందు బీజేపీ బేజారు అయిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పావులకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిత్తయ్యారా? చిన్నమ్మ తిప్పిన చక్రం ముందు బీజేపీ బేజారు అయిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ నాలుగు.. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు: రిపోస్టుమార్టం?ఆ నాలుగు.. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు: రిపోస్టుమార్టం?

జయలలిత మృతి చెందినప్పటి నుంచి శశికళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఈ ఇరవై రోజుల్లో రోజుల్లో పార్టీలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత... తిరిగి చిన్నమ్మకే పదవి దక్కింది.

శశికళను అడ్డుకునేందుకు రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, జయలలిత కోడలు దీపా జయకుమార్ తదితరులు ఎందరో ప్రయత్నించారు. అయితే, ఇవి కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యాయి. మీడియాలోను వీరే కనిపించారు.

sasikala

వెనుక చక్రం తిప్పారు..

బహిరంగంగా శశికళ పుష్ప, దీపా జయకుమార్‌లు శశికళ పైన దుమ్మెత్తి పోసినప్పటికీ... వెనుక నుంచి బిజెపి, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చక్రం తిప్పారని, కానీ చిన్నమ్మ పావులకు వారిద్దరు చిత్తయ్యారని అంటున్నారు.

ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!

శశికళ చుట్టు ఉచ్చు బిగిద్దామనుకుంటే..

తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే పార్టీల హవా ఉంది. ఇప్పటి దాకా జాతీయ పార్టీల ప్రభావం లేదు. అయితే, ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలోని పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పాగా వేసేందుకు సిద్ధమయిందని అంటున్నారు.

శశికళకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను పావుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసిందని, అలాగే శశికళను రేసు నుంచి తప్పించేందుకు పన్నీరు కూడా కేంద్రం సహకారం తీసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

జయలలితతో పోలికా, కరుణానిధితో సై: శశికళ ఎఫెక్ట్.. పార్టీ వీడిన ఫిల్మ్ స్టార్జయలలితతో పోలికా, కరుణానిధితో సై: శశికళ ఎఫెక్ట్.. పార్టీ వీడిన ఫిల్మ్ స్టార్

పన్నీరు సెల్వం ఢిల్లీకి వెళ్లి వచ్చాక మాజీ సీఎస్ రామ్మోహన రావు ఉంటి పైన ఐటీ దాడులు జరిగాయి. అంతేకాదు, పన్నీరు పోయెస్ గార్డెన్ కూడా వెళ్లలేదు. మరోవైపు బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఇటు శశికలతో టచ్‌లో ఉంటూనే, మరోవైపు పన్నీరు సెల్వం ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు చేసిందనే వాదనలు ఉన్నాయి.

శశికళ వ్యూహాల ముందు..

బీజేపీ ద్వారా పన్నీరు సెల్వం.. శశికళకు ఉచ్చు బిగిద్దామనుకున్నా, పన్నీరు సెల్వం ద్వారా శశికళకు చెక్ చెబుతామనుకున్న బీజేపీ ప్రణాళికలు తమిళ వ్యూహాలు లేదా శశికళ వ్యూహాల ముందు పని చేయలేదని అంటున్నారు. జాతీయ పార్టీ మద్దతున్నా పన్నీరు సెల్వం రాజకీయ చదరంగంలో శశికళ ముందు ఓడిపోయారని అంటున్నారు. చివరకు ఆమె వద్దకు రావాల్సి వచ్చిందంటున్నారు.

దటీజ్ చిన్నమ్మ..

శశికళను పార్టీ అధ్యక్షురాలిగా చేసేందుకు పార్టీ నియమావళిని సవరించారు. పార్టీ అధ్యక్షురాలు కావాలంటే ఐదేళ్ల పాటు పార్టీ సభ్యురాలిగా ఉండాలి. కానీ శశికళకు ఐదేళ్లు పూర్తి కాలేదు. కానీ ఆమె కోసం ఈ నిబంధనలో మార్పు చేశారు.

English summary
The Election Of Sasikala Is A Message To Both BJP And Chief Minister O Panneerselvam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X