దినకరన్ మీద మరో కేసు నమోదు: దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ పరిస్థితి దారుణంగా తయారైయ్యింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఆయన మీద మంగళవారం (మే 2వ తేదీ) మరో కేసు నమోదు అయ్యింది. ఈసారి టీటీవీ దినకరన్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

పళనిసామికి షాక్: 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: కొత్త గ్రూపు లీడర్'తోపు '!

అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి ఏకంగా ఎన్నికల యంత్రాగానికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి టీటీవీ దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ సెంట్రల్ జైలుకు తరలించారు.

అయ్యో టీటీవీ దినకరన్

అయ్యో టీటీవీ దినకరన్

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని టీటీవీ దినకరన్ మీద కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. టీటీవీ దినకరన్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

అక్రమ నగదు వ్యవహారం

అక్రమ నగదు వ్యవహారం

టీటీవీ దినకరన్ ఆదాయానికి మంచి నగదు లావాదేవీలు నిర్వహించాడని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. 20 ఏళ్ల క్రితం అక్రమంగా విదేశాలకు అక్రమ లావాదేవీలు నిర్వహించాడని ఈడీ అధికారులు కేసు (ఫెరా) నమోదు చేశారు. చెన్నైలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు తుది విచారణలో ఉంది.

బెయిల్ ఇచ్చే చాన్స్ లేదు

బెయిల్ ఇచ్చే చాన్స్ లేదు

ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో దినకరన్ కు బెయిల్ వచ్చినా వెంటనే మళ్లీ ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

దినకరన్ కు కష్టకాలం

దినకరన్ కు కష్టకాలం

తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ కు ఇప్పుడు కష్టకాలం మొదలైయ్యింది. టీటీవీ దినకరన్ తో ఇంత కాలం చనువుగా ఉంటూ నానా హంగామా చేసిన ఆయన అనుచరులు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఆయనతో పెట్టుకుంటే జైలు గ్యారెంటీ అంటూ హడలిపోతున్నారు.

దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది

దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది

టీటీవీ దినకరన్ కు ప్రస్తుతం దరిద్రం అదృష్టం పట్టుకున్నట్లు పట్టుకుంది. దినకరన్ తో పాటు ఆయన అనుచరులు ఎంత మంది జైలుకు వెలుతారో ? ఎన్ని కేసుల విచారణ ఎదుర్కొంటారో ? వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The enforcement directorate on Tuesday filed a case against TTV Dinakaran for money laundering. Following the investigations against TTV Dinakaran by the Delhi crime branch police in the alleged election commission bribery row, the enforcement directorate has now booked him for illegal money transaction.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి