Parliament: పార్లమెంట్ తొలిరోజే రచ్చ - నీట్ పై విపక్షాల ఆందోళన-ఎంపీల ప్రమాణం..!
పార్లమెంట్ తొలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్వీకర్ భర్తృహరి మోహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే ఈ ఏడాది నీట్ పరీక్షా పత్రం లీకేజీలపై విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రమాణస్వీకారం చేయకముందే ప్రభుత్వం నీట్ లీకేజీలపై చర్చించాలని కోరుతూ వారు నిరసనలు చేపట్టారు. దీంతో కాసేపు లోక్ సభలో గందరగోళం నెలకొంది.

Proud to serve our nation. Taking oath as a Member of Parliament.https://t.co/0JnLbdOzkc
— Narendra Modi (@narendramodi) June 24, 2024
ఈసారి ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మొహతాబ్ తో ముందుగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పార్లమెంట్ కు వచ్చి మెహతాబ్ సభ్యులతో ప్రమాణాలు చేయిస్తున్నారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు మరో 260 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇవాళ 18వ లోక్ సభ తొలిరోజు ప్రధాని మోడీ తొలి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన కేబినెట్ మంత్రులు, ఎంపీలు వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇదే క్రమంలో మోడీ కేబినెట్లో ఏపీ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో ఎంపీగా ప్రమాణం చేశారు. విపక్ష నేత రాహుల్ గాంధీ రేపు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసారి లోక్ సభలో మొత్తం 280 మంది కొత్త ఎంపీలున్నారు. అలాగే 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.












Click it and Unblock the Notifications