పన్నీర్ వార్నింగ్: డ్రామాలు వేస్తే అంతు చూస్తా, ఎవరికంటే ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీరియస్ అవుతారని ఆ పార్టీ నాయకులు ఊహించలేకపోయారు. గుర్తించారు. అన్నాడీఎంకే పార్టీలో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో కొందరు స్వార్థం కోసం రెండు వర్గాలు సృష్టించి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారని సమాచారం.
తమిళనాడులో ఇటీవల నానా బీభత్సం సృష్టించిన వర్దా నష్టాన్ని అంచానా వెయ్యడానికి చెన్నై చేరుకున్న కేంద్ర ప్రత్యేక బృందంతో బుధవారం భేటీకావాడనికి బయలుదేరే ముందు పన్నీర్ సెల్వం తనకు సన్నిహితులైన మంత్రులతో సమావేశం అయ్యారు.
ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడిన కొందరు మంత్రుల పేర్లు ప్రస్తావించకుండా పన్నీర్ సెల్వం పరోక్షంగా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీలో అందరూ అమ్మను తలచుకుంటూ ముందుకు వెళ్లాలని, లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పరోక్షంగాహెచ్చరించారని తెలసింది.

అంతే కాకుండా అన్నాడీఎంకే పార్టీ సిద్దంతాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుంటే అందరికి మంచిదని సున్నిహితంగా హెచ్చరించారని తెలిసింది.
ఇంతకాలం సహనంగా ఉన్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒక్క సారిగా క్లాస్ పీకడంతో కొందరు మంత్రులు హడలిపోయారు. సీఎం చెప్పడం వినడమే తప్పా వారు నోరు తెరచి తిరిగి మాట్లాడలేకపోయారని సమాచారం.
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం ఒక్క రోజులో జరగనున్న సమయంలో సీఎం పన్నీర్ సెల్వంలో వచ్చిన మార్పు చూసి మంత్రులతో పాటు అన్నాడీఎంకే నాయకులు ఉలిక్కిపడ్డారని తెలిసింది. అనంతరం పన్నీర్ సెల్వం కేంద్ర అధికారుల బృందంతో భేటీకావాడనికి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications